AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనితో అలాంటిది ఏమీ లేదు.. అదే ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు ఉండేవారు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ కంగనా సినిమాలు చేసింది.

అతనితో అలాంటిది ఏమీ లేదు.. అదే ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు ఉండేవారు
Kangana Ranaut
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2026 | 12:22 PM

Share

బాలీవుడ్ సినిమాల్లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున చెప్పే పేరు కంగనా రనౌత్. ఈ అమ్మడు సినిమాలతో పాటు పలు వివాదాలతోనూ చాలా పాపులర్ అయ్యింది. హిందీలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసింది ఈ అందాల తార. డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ముక్కుసూటిగా మాట్లాడడంతో బాలీవుడ్ పెద్దలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తనే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఇప్పుడు బీజీపీ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఆమె ఎంపిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే కంగనాకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

ఈ ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ వార్తలు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్ పై కంగనా స్పందించింది. , కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు తనకు లవ్ అంటూ వస్తున్న వార్తల పై సరదగా రియాక్ట్ అయ్యింది కంగనా. అతను నాకు మంచి స్నేహితుడు. అంతకు మించి ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. అయితే కంగనా, చిరాగ్ పాశ్వాన్‌ ఇద్దరూ  ‘మిలే నా మిలే హమ్’ అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాంతో రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. చిరాగ్ కేవలం నా స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. నిజం చెప్పాలంటే.. మా మధ్య ప్రేమ ఉండి ఉంటే, ఈ పాటికి మాకు పిల్లలు ఉండేవారు. మా పరిచయం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితమే మేం కలిసి సినిమా చేశాం.. అంటూ కంగనా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!