12 ఏళ్ల కష్టం..నాన్నను కోల్పోయి..’డియర్ భరత్ కమ్మ’

‘డియర్ కామ్రేడ్’…మూవీ రిలీజైయ్యింది. హా..అయితే ఏంటి? ప్రతి శుక్రవారంలాగే ఒక మూవీ విడుదలయ్యింది అనే ఫీలింగ్ అందరికి వస్తుంది. మహా అయితే అది గీతగోవిందం లాంటి సెన్సేషనల్ మూవీలోని పెయిర్ విజయ దేవరకొండ, రష్మిక మందన.. లీడ్ రోల్స్‌లో నటించిన రెండో సినిమా. ఇంకా అనుకుంటే టాలీవుడ్ సక్సెస్‌పుల్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ నుంచి వచ్చిన మూవీ. ఇవి మాత్రమే ఊహకు వస్తాయి. కానీ ఆ సినిమా వెనుక ఓ దర్శకుడి పుష్కరకాలం కల ఉంది. […]

12 ఏళ్ల కష్టం..నాన్నను కోల్పోయి..'డియర్ భరత్ కమ్మ'
Follow us

|

Updated on: Jul 26, 2019 | 9:06 PM

‘డియర్ కామ్రేడ్’…మూవీ రిలీజైయ్యింది. హా..అయితే ఏంటి? ప్రతి శుక్రవారంలాగే ఒక మూవీ విడుదలయ్యింది అనే ఫీలింగ్ అందరికి వస్తుంది. మహా అయితే అది గీతగోవిందం లాంటి సెన్సేషనల్ మూవీలోని పెయిర్ విజయ దేవరకొండ, రష్మిక మందన.. లీడ్ రోల్స్‌లో నటించిన రెండో సినిమా. ఇంకా అనుకుంటే టాలీవుడ్ సక్సెస్‌పుల్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ నుంచి వచ్చిన మూవీ. ఇవి మాత్రమే ఊహకు వస్తాయి. కానీ ఆ సినిమా వెనుక ఓ దర్శకుడి పుష్కరకాలం కల ఉంది. యూఎస్‌ నుంచి వచ్చిన జాబ్ ఆఫర్‌ను తృణప్రాయంగా తిరస్కరించిన ఓ యువకుడి ఆవేశం ఉంది. జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ వచ్చిన చెక్కుచెదరని ఓ యువదర్శకుడి దృడసంకల్పం ఉంది.  హి ఈజ్ నన్ అదర్‌దెన్ భరత్ కమ్మ.

ప్రతి శుక్రవారం జీవితాలు తారుమారయ్యే ఇండస్ట్రీలో నెగ్గుకురావడమంటే మాములు విషయం కాదు. ఇక్కడ రకరకాలు మనుషులు ఉంటారు. ఒక్కోక్కరిది ఒక్కో టైప్ మనస్తత్వం. క్రియేటీవ్ ఫీల్డ్ కాబట్టి ఇగోలు కూడా సహజం. వీటన్నీటిని దాటుకురావాలంటే ఓర్పు, సహనం, పట్టుదల కావాలి. వీటన్నీటి కంటే ముందు టాలెంట్ ఉండాలి. అన్నీ ఉండి కూడా తన కల నెరవేరడానికి  12 ఏళ్లు ఎదురుచూశాడు ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ.  సినిమా ఓకే అయ్యాక కూడా మూడేళ్లు అది సెట్స్‌కి వెళ్లడానికి టైం పట్టిదంటేనే అర్థమవుతోంది… విధి అతనితో ఎన్ని ఆటలు ఆడుకుందో!

తానూ కలగన్న రోజు రానే వచ్చింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.  బట్ ఒక విషయం మాత్రం భరత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనదైన రోజున తన కోసం ఎన్నో కలలు కన్న వాళ్ల నాన్న సజీవంగా లేకపోవడం.  ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ సగం పూర్తయిన సమయంలో తండ్రి చనిపోవడం భరత్‌ను బాగా కృంగదీశింది. ఎంతలా అంటే అప్పుడప్పుడు కారవాన్‌లోకి పోయి ఏడ్చి…మళ్లీ బయటకు వచ్చి షూట్ డిస్బబ్ అవ్వకుండా మునిపంటిన బాధను బిగబట్టి ముందుకు వెళ్లేంతగా.

ఈ సినిమాని ఒక ఆరు నెలల ముందు విడుదల చేయనందుకు తాను జీవితాంతం బాధ పడతానని భరత్ అనడం అతనికి తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తుంది. తల్లిదండ్రుల ముఖాల్లో బిడ్డల తాలుకూ సక్సెస్ మించిన  ఆభరణం మరొకటి ఏముంటుంది. దాన్నే మిస్ అయ్యాడు భరత్ కమ్మ. ఇన్నేళ్లు కష్టపడి సినిమా చేసే అవకాశం అందుకుంటే ఆ సినిమాను తన తండ్రికి చూపించలేకపోయాడు. కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ అతనితో ఉంటాయి. నలుగురికి మంచి చేయాలనే గుణం, పదిమందికి అన్నం పెట్టాలనే లక్షణం, తను నమ్ముకున్న ఇండస్ట్రీ బాగుండాలే ఆశ ఉన్న మంచి వ్యక్తుల స్థాయి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ యువ దర్శకుడు విజువల్ వండర్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..పలు శుక్రవారాలు మీపేరుతో మారమోగిపోవాలని ఆశిస్తూ..ఆ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘డియర్ భరత్ కమ్మ’.