సమంతనే ఆ పాత్రకు కరెక్ట్.. ఆమెలా నేను చేసేదాన్ని కాదేమో..!

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Jul 26, 2019 | 8:52 PM

అందాల ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుపమా.. బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా.. టీచర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని రామలక్ష్మి పాత్ర గురించి నన్ను అడిగారని.. కానీ.. అప్పుడు నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోయిందని చెప్పింది. […]

సమంతనే ఆ పాత్రకు కరెక్ట్.. ఆమెలా నేను చేసేదాన్ని కాదేమో..!

అందాల ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుపమా.. బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా.. టీచర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని రామలక్ష్మి పాత్ర గురించి నన్ను అడిగారని.. కానీ.. అప్పుడు నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోయిందని చెప్పింది. అలాగే.. ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ.. ఫీల్ అవుతున్నానని తెలిపింది. అయినా.. ఒకవేళ నేను ‘రామలక్ష్మీ’ పాత్ర చేసినా.. సమంత చేసినంత గొప్పగా నేను చేసివుండక పోవచ్చని తెలిపింది. నాకంటే ఆ పాత్రికి సమంతనే కరెక్ట్ అనుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu