Nidhhi Agerwal: ఆ ఇద్దరు కుర్ర హీరోలతో డేటింగ్‌కు వెళ్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్..
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్(Nidhhi Agerwal). తొలిసినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయినా..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్(Nidhhi Agerwal). తొలిసినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయినా.. నిధి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. అదే సమయంలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టింది. ఈ మూవీలో నటనతోనే కాదు గ్లామర్ తోనూ కట్టిపడేసింది ఈ చిన్నాది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడకుండా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది నిధి. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా హిట్ అయ్యిందంటే అమ్మడు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుందని ఆశతో ఉంది ఈ సొగసరి.
తాజాగా నిధి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చింది. మీరు డేట్ కు వెళ్లాలంటే ఈ హీరోలతో వెళ్తారు అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. నిధి స్పందిస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, లేదా అక్కినేని కుర్ర హీరో అఖిల్ తో వెళ్తానని చెప్పుకొచ్చింది నిధి. దాంతో ఈ కుర్ర హీరోల పై నిధి అగర్వాల్ మనసు పారేసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే తనకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అంటే క్రష్ అని చెప్పుకోచంది నిధి. తమిళంలో కేవలం రెండు సినిమాల్లోనే నటించినా నిధికు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో మరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భామ.








