కలెక్షన్ల ఊచకోత..వస్తాద్ పూరి జగన్నాథ్

‘ఇస్మార్ట్ శంక‌ర్’ బాక్సాఫీస్‌ని చాలా స్మార్ట్‌గా కలెక్షన్లు  కొల్ల‌గొడుతున్నాడు. ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఒక సినిమాని ఎత్తాలన్నా, దించాలన్నా మాస్ ఆడియెన్స్‌కే సాధ్యం. దీంతో తమకు ఇష్టమైన డైరక్టర్‌ చాలా కాలం తర్వాత ఇచ్చిన మాస్ ఫీస్ట్‌ను వాళ్లు బ్లాక్ బాస్టర్ చేసే పనిలో ఉన్నారు.  బాక్సాఫీస్ వ‌ద్ద ‘ఇస్మార్ట్ శంక‌ర్’ క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు […]

కలెక్షన్ల ఊచకోత..వస్తాద్ పూరి జగన్నాథ్
Follow us

|

Updated on: Jul 21, 2019 | 1:40 PM

‘ఇస్మార్ట్ శంక‌ర్’ బాక్సాఫీస్‌ని చాలా స్మార్ట్‌గా కలెక్షన్లు  కొల్ల‌గొడుతున్నాడు. ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఒక సినిమాని ఎత్తాలన్నా, దించాలన్నా మాస్ ఆడియెన్స్‌కే సాధ్యం. దీంతో తమకు ఇష్టమైన డైరక్టర్‌ చాలా కాలం తర్వాత ఇచ్చిన మాస్ ఫీస్ట్‌ను వాళ్లు బ్లాక్ బాస్టర్ చేసే పనిలో ఉన్నారు.  బాక్సాఫీస్ వ‌ద్ద ‘ఇస్మార్ట్ శంక‌ర్’ క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్‌తో కలుపుకొని రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గలేదు. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో కలిపి 4.29 కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను రూ. 11.75 కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమా సత్తా ఏమిటో చూపించింది.

తాజాగా ఈ సినిమా మూడో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలుపుకొని రూ. 6.5కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా ఈ సినిమాను రూ. 18 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో రూ.36 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న  ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చింది.  ఈ చిత్రానికి పోటీగా మ‌రో చిత్రం లేక‌పోవ‌డం, వీకెండ్ కూడా క‌లిసి రావ‌డంతో చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్‌గా విడుద‌లైంది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌కి ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో మంచి హిట్ దొరికింద‌నే చెప్పాలి

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్