AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ బ్రాండ్ అంబాసీడర్‌గా ఎన్టీఆర్?..జగన్ మనసులో ఏముంది?

ఏపీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం జగన్ పదే..పదే చెప్తున్న విషయం తెలిసిందే!.  ఆ దిశగా ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించేశారు. ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా.. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికి..అత్యధిక ఆదాయం సమకూర్చే బెల్టు షాపులను విడతలవారిగా నిషేదించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం […]

ఏపీ బ్రాండ్ అంబాసీడర్‌గా ఎన్టీఆర్?..జగన్ మనసులో ఏముంది?
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2019 | 12:01 PM

Share

ఏపీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం జగన్ పదే..పదే చెప్తున్న విషయం తెలిసిందే!.  ఆ దిశగా ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించేశారు.

ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా.. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికి..అత్యధిక ఆదాయం సమకూర్చే బెల్టు షాపులను విడతలవారిగా నిషేదించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం జగన్ మరో కీలక డెషీసన్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో విసృత చర్చ నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ నియామకం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీలో ఇంటర్నల్‌గా చర్చ జరిగినట్టు సమాచారం. అంతేకాదు తారక్‌కు అతి సన్నిహితంగా ఉండే మంత్రి కొడాలి నాని, ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి ద్వారానే ఈ ప్రపోజల్ ముందుకు వచ్చిందని సమాచారం.

గత కొద్దికాలంగా ఎన్టీఆర్ టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి తన సోదరి సుహాసిని కంటెస్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. జస్ట్ తమ సోదరికి సపోర్ట్ చేయమని ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ విడుదల చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఆమడదూరంలో ఉండిపోయాడు తారక్. పార్టీ నుంచి కూడా ఆయనకు పిలుపు అందలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్..ఎన్టీఆర్‌ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలని భావిస్తే..ఎన్టీఆర్ ఆ నిర్ణయానికి సమ్మతిస్తే..రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియామకం పెద్ద సంచలనమే అవుతుంది.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!