AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: అల్లు అర్జున్ కాదు.. ఆ మెగా హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా.?

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి మొన్నీమద్యే అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ఏప్రిల్ 8 ప్రకటించారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

Trivikram Srinivas: అల్లు అర్జున్ కాదు.. ఆ మెగా హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా.?
Trivikram Srinivas
Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 11:34 AM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాములుగా త్రివిక్రమ్ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. సినిమాలో కథతో పాటు ఆయన డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు చేశాడు గురూజీ. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు అట్లీ. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు గురూజీ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట. అల్లు అర్జున్, అట్లీ సినిమా షూటింగ్ లెట్ అయ్యే అవకాశం ఉండటంతో.. త్రివిక్రమ్ మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ టాక్.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. పెద్ది అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా చరణ్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో  రామ్ చరణ్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..