AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సినిమాలో సీనియర్ హీరో.. ఇన్నాళ్ల తర్వాత ఇలా..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కింగ్ డమ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సినిమాలో సీనియర్ హీరో.. ఇన్నాళ్ల తర్వాత ఇలా..
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 10:33 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఇది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. విజయ్ ఈ సినిమాలో సరికొత్త గెటప్‌లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్‌లో విజయ్ లుక్స్, ఎన్టీఆర్ వాయిస్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలను కూడా లైనప్ చేశాడు విజయ్.

వాటిలో రౌడీ జనార్ధన సినిమా ఒకటి.. ఈ సినిమాకు రవికిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ అబ్బవరంతో కలిసి రాజావారు రాణిగారు సినిమా చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నారని టాక్. ఆయన ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్. రాజశేఖర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఆయన ఈ సినిమాలో విలన్ గా నటిస్తారా లేదా పాజిటివ్ రోల్ లో కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డనరీ మాన్ సినిమాలో నటించారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది. మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ పోస్టర్‌  రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో “కత్తినేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే” అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.