Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో.. కాంబో అదిరిపోయిందిగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 29 (వర్కింగ్ టైటిల్). దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న.

SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో.. కాంబో అదిరిపోయిందిగా..!
Ssmb 29
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2025 | 10:02 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. మహేష్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా ఈసినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు మహేష్ బాబు. తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు.

SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాను జక్కన్న నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాగురించి ఇప్పటికే చాలా రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ రాజమౌళి సినిమాలో పలువురు తమిళ్ స్టార్ హీరోలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చియాన్ విక్రమ్ ఇప్పటికే మహేష్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్. ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో