Meena: మీనా నిజంగానే రెండో పెళ్లికి రెడీ అయిందా? ఆమె సన్నిహితులు ఏమంటున్నారంటే?

46 ఏళ్ల మీనా ఒంటరిగా ఉండకూడదని, ఆమె కూతురు భవిష్యత్‌ కోసం మళ్లీ పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారని వార్తలు గుప్పుమంటున్నాయి.

Meena: మీనా నిజంగానే రెండో పెళ్లికి రెడీ అయిందా? ఆమె సన్నిహితులు ఏమంటున్నారంటే?
Actress Meena
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2022 | 4:04 PM

ప్రముఖ టాలీవుడ్‌ నటి మీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా భర్తను కోల్పోయిన ఆమె మళ్లీ పీటలెక్కనున్నారని నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 46 ఏళ్ల మీనా ఒంటరిగా ఉండకూడదని, ఆమె కూతురు భవిష్యత్‌ కోసం మళ్లీ పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకోసం తమ బంధువుల్లోనే ఒకరిని వరుడిగా ఎంపిక చూశారని, మీనా కూడా ఓకే అందని వార్తలు వస్తున్నాయి. అయితే మీనా రెండో పెళ్లిపై ఆమె కానీ, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా తన రెండో పెళ్లిపై వస్తోన్న వార్తలపై ఘాటుగా స్పందించింది మీనా. ‘డబ్బు, పాపులారిటీ కోసం ఏమైనా రాస్తారా? సోషల్‌ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు. ఇలా అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని మీనా గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.

ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వదందులను ఆమె క్లోజ్‌ఫ్రెండ్‌ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందన్నారు. దయచేసి ఇలాంటి పుకార్లు సృష్టించి వారి ప్రైవసీకి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో మీనా రెండో పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. 2009లో మీనా వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. అయతే దురదృష్టవశాత్తూ ఈ ఏడాది జూన్ 28న విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ దంపతులకు నైనిక అనే పదేళ్ల కూతురు ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..