90’s A Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడికి క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్
సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా సినిమాల రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ఇప్పటికే చాలా రకాల వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఊహించని విధంగా రెస్పాన్స్ సొంతం చేసుకొని టాప్ లో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. వాటిలో 90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఒకటి.

కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చూడరు ప్రేక్షకులు.. అలా చిన్న సినిమాలుగా వచ్చిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా సినిమాల రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ఇప్పటికే చాలా రకాల వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఊహించని విధంగా రెస్పాన్స్ సొంతం చేసుకొని టాప్ లో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. వాటిలో 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఒకటి. సీనియర్ యాక్టర్ శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.
90లో మిడిల్ క్లాస్ ప్రజలు ఎలా ఉండేవారు.. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి ఈ వెబ్ సిరీస్ లో చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు ఆదిత్య హాసన్. చిన్న కుర్రాడే అయినా చక్కటి కంటెంట్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరోకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో ఆదిత్య పనితీరు చూసిన చాలా మంది హీరోలు అతడికి ఛాన్స్ ఇస్తున్నారట.
అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో ఆదిత్య సినిమా చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవలే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆదిత్యతో ఓ సినిమా చేయనున్నాడట నితిన్. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
90లో మిడిల్ క్లాస్ బయోపిక్
Vintage Vibes and Victory Cheers💥✨
Celebrating the Grand Success Meet of #90s A Middle Class Biopic, Today @ 3 PM🙌
Watch Live 👉https://t.co/0apko4Xncg@mouli_talks @MNOPRODUCTIONS @az_dop @Gnaadikudikar @vinod_nagula @sharvin1995 @Saikishore040 @Messsyminds_offcl… pic.twitter.com/YJSgFprRuh
— BA Raju’s Team (@baraju_SuperHit) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి