AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇండస్ట్రీలో క్రేజీ అప్డేట్.. ప్రభాస్.. మారుతీ ప్రాజెక్ట్ అనౌన్స్‏మెంట్ వచ్చేది అప్పుడేనా ?..

డార్లింగ్ నటిస్తోన్న స్పిరిట్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.

Prabhas: ఇండస్ట్రీలో క్రేజీ అప్డేట్.. ప్రభాస్.. మారుతీ ప్రాజెక్ట్ అనౌన్స్‏మెంట్ వచ్చేది అప్పుడేనా ?..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2022 | 8:59 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‏తో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్ ఇప్పుడు వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. డార్లింగ్ నటిస్తోన్న స్పిరిట్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఓవైపు ప్రాజెక్ట్స్ చిత్రీకరణలో బిజీగా ఉంటూనే మరోవైపు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటివరకు పలు చిత్రాలకు అనౌన్స్ మెంట్ రావాల్సింది ఉంది. అందులో డైరెక్టర్ మారుతి మూవీ కూడా ఒకటి.

ముందు నుంచి వీరి కాంబోలో రాబోయే సినిమా గురించి పలు అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త మేకోవర్‏లో కనిపించనున్నాడని టాక్ వినిపించింది. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. డైరెక్టర్ మారుతీ ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో మ్యాచో హీరో గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా జూలై 1న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతీ ప్రభాస్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీరి కాంబోలో రాబోతున్న సినిమా అనౌన్స్ మెంట్ పక్కా కమర్షియల్ రిలీజ్ అనంతరం దాదాపు పది రోజుల గ్యాప్ తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ సినిమా అప్డే్ట్ రాబోతుందంటూ నెట్టింట సందడి షూరు చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే చిత్రీకరణలో పాల్గోంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో