Anger Tales: మీ అభిమాన తారలతో చూడచక్కని ‘యాంగర్ టేల్స్’ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?
ట్రైలర్ అయితే సాలిడ్‌గా ఉంది. మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. రియలిస్టిక్ లైఫ్‌కు చాలా దగ్గరక సంఘటనలు తీసుకుని కథ అల్లినట్లు అర్థమవుతుంది.
కంటెంట్ బాగుంటే చాలు.. భాషా బేధం లేకుండా ఎలాంటి సినిమాలైనా, వెబ్ సిరిస్‌లైనా ఎంకరేజ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కాస్త బడ్జెట్ తక్కువలో తీసే వెబ్ సిరీస్‌ల ప్లో పెరిగింది. తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది. బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, వెంకటేశ్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీ రోల్స్‌లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘యాంగర్ టేల్స్’. ప్రభల తిలక్ దీన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ కూడా మంచి ఇంట్రస్టింగ్‌గానే కనిపిస్తుంది. జీవితంపై ఎన్నో ఆశలు, కలలతో ఉన్న నలుగురు వ్యక్తులకు… వారికి నచ్చని జీవితం ఎదురైతే.. వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసకుంటాయి? అన్న ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను రూపొందిచారు. యాక్టర్ సుహాస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం మరో హైలెట్. ఆ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
‘
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.