AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బోస్టన్ యూనివర్సిటీలో చదువు.. ఓటీటీ సంస్థలో జాబ్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించింది. ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో ఉద్యోగానికి చేరింది. అదే సమయంలో హీరోయిన్ గానూ సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది.

Tollywood: బోస్టన్ యూనివర్సిటీలో చదువు.. ఓటీటీ సంస్థలో జాబ్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 2:44 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల ప్రాతినిథ్యం తక్కువే. ఈ మధ్యన మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అన్నట్లు తెలుగు సినిమాల్లో కేవలం 20 శాతం అవకాశాలు మాత్రమే తెలుగు హీరోయిన్లకు దక్కుతాయట.ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ గతంలో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు సినిమాల్లో తెలుగమ్మాయిల ప్రాతినిథ్యం బాగా పెరిగింది. వైష్ణవి చైతన్య, అనన్య నాగళ్ల, చాందినీ చౌదరి.. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి కొత్త తెలుగు హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరొకరు చేరారు. గతంలో ఓ సూపర్ హిట్ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆమె ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది. ఉన్నత చదువులు అభ్యసించేందుకు అమెరికా వెళ్లింది. అక్కడి బోస్టన్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో ఇంటర్న్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా జాబ్ చేస్తోంది. ఇదే క్రమంలో నటనపై మళ్లీ మనసు మళ్లడంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఓ చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల ఆమె నటించిన రెండో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఈ అందాల తార అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు శుభం హీరోయిన్ శ్రియ కొంతం.

గతంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో హీరో చెల్లి స్వాతి పాత్రలో నటించింది శ్రియ. ఆ తర్వాత ఉన్నత చదువుల కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో రిలీజైన 14 డేస్ గర్ల్‌ ఫ్రెండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా శుభం సినిమాతో సక్సెస్ కొట్టింది. దీనికి ముందు హరికథలు అనే వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించింది శ్రియ. సినిమా పరిశ్రలో రాణిస్తూనే వ్యాపార వేత్తగా ఎదగాలన్నది ఈ ముద్దుగుమ్మ లక్ష్యమట. ముఖ్యంగా ఓటీటీ స్టార్టప్ నెలకొల్పాలన్నది శ్రియ మనసులో ఉందట.

ఇవి కూడా చదవండి

శ్రియ లేటెస్ట్ ఫొటోస్..

కాగా శ్రియకు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

శుభం సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి