SP Balu Death Anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో చెరగని సంతకం ఎస్పీ బాలు.. గాన గంధర్వుడి జీవితంలో ముఖ్య విశేషాలు

SP Balu Death Anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ చెరగని ముద్ర.. దాదాపు 40 ఏళ్ళు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న బాలు గురించి ఎంత చెప్పుకున్నా..

SP Balu Death Anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో చెరగని సంతకం ఎస్పీ బాలు.. గాన గంధర్వుడి జీవితంలో ముఖ్య విశేషాలు
Sp Balu
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2021 | 4:18 PM

SP Balu Death Anniversary: తెలుగు సినీ వినీలాకాశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ చెరగని ముద్ర.. దాదాపు 40 ఏళ్ళు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న బాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వేల పాటలను వివిధ భాషల్లో పాడిన బాలు ఎన్నో అవార్డులను, రివార్డులను, ప్రభుత్వ పురష్కారాలను అందుకున్నారు గాన గంధర్వుడు. నేడు ఆయన ప్రధమ వర్ధంతి..  ఈరోజు ఎస్పీబీ బాలు జీవితంలో  కొన్ని విశేషాలను గుర్తు చేసుకుందాం..

తెలుగు సినీ పరిశ్రమలో తొలితరం గాయకుల్లో ఘంటశాల వెంకటేశ్వర రావు వంటి ఎందరో మహానుభావులు తమదైన ముద్రవేస్తే.. ఆ పునాదిపై ఓ అందమైన సంగీత సౌధాన్ని నిర్మించారు ఎస్పీబాలు. కొన్ని దశాబ్దాల పాటు తన గాత్రంతో క్లాస్, మాస్ అనే తేడాలేకుండా సినీ సంగీత ప్రేక్షకులను అలరించారు. కరోనాతో పోరాడి ఓడిన బాలు 2020 సెప్టెంబర్ 25న మృత్యుఒడికి చేరుకున్నారు. అప్పుడే ఆయన మరణించి ఏడాది గడిచిందా అనిపిస్తుంది.  మొదటి వర్ధంతి బాలుకి నివాళులు సినీ సంగీత ప్రపంచం అర్పిస్తోంది.

*ఎస్పీబాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అందుకనే ఆయన్ని ముద్దుగా ఎస్పీబీ అని, బాలు అని పిలుచుకుంటారు. అయితే ఇంట్లో, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం మణి అని పిలుస్తారు. అంతేకాదు మణి అని సంగీత దర్శకులు చక్రవర్తి,  కెవి  మహదేవన్ లు కూడా పిలిచేవారట.

*ఎస్పీబీకి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని బంధువులున్నారు. అయితే వారందరూ కూడా టాలీవుడ్ లో తమదైన ముద్రవేశారు. ఎస్పీ కోదండ పాణి, కె విశ్వనాథ్, చంద్రమోహన్ లు బాలసుబ్రహ్మణ్యానికి బంధువులు.

*స్నేహానికి బాలు మంచి విలువ ఇస్తారు. సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో బాలు వద్ద మేనేజర్ గా విట్టల్ పనిచేసారు. విట్టల్ తో స్నేహం ఎంతో అపురూపమని పలు సందర్భాల్లో బాలు చెప్పారు.

*16 భారతీయ భాషల్లో 40000 పాటలకు పైగా పాటలను పాడిన బాలు ప్రపంచ రికార్డును సృష్టించారు.

*1980 లో విడుదలైన శంకరాభరణం సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచారు. అంతేకాదు గాయకుడిగా మొదటిసారిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

*బాలుకి స్మోకింగ్ అలవాటు ఉండేదట. ఇంకా చెప్పాలంటే తాను స్మోకింగ్ కు బానిస అని బాలు స్వయంగా చెప్పారు. అయితే తన కూతురు పల్లవి “నా మాట విని స్మోకింగ్ మానేయండి నాన్నా” అని అడగడంతో.. అప్పటి నుంచి స్మోకింగ్ కు గుడ్ బై చెప్పారట.

* 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు బాలు

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని  25 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు  అందుకున్నారు.

*భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (2001) మరియు పద్మభూషణ్ (2011) ,పద్మ విభూషణ్ (2021)వంటి పౌర పురస్కారాలను అందుకున్నారు

* ఎస్పీబీ కొన్నేళ్ల క్రితంవోకల్ కార్డ్స్ కి సంబంధించి గొంతు సమస్య ఏర్పడింది. ఆ సమయంలో ఆపరేషన్ తప్పనిసరని.. అయితే సర్జరీ అనంతరం గొంతులో మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో లతా మంగేష్కర్.. ఎస్పీబీకి ఫోన్ చేసి సర్జరీ వద్దని.. మెడికేషన్ తో మేనేజ్ చేయమని సలహా ఇచ్చారట అయితే బాలు రిస్క్ చేసి గొంతు సర్జరీ చేయించుకున్నారు. అయితే దేవుడి దయవలన ఆపరేషన్ సక్సెస్ కావడమేకాదు.. గళంలో ఎటువంటి మార్పులు రాలేదు. ఆపరేషన్ ముగిసిన అనంతరం నాలుగురోజులకే  మళ్ళీ పాడడం మొదలు పెట్టినట్లు ఆయన స్వయంగా చెప్పారు.

*బాలు సినిమాల్లోనే కాదు బుల్లి తెరపై కూడా పాడుతా తీయగా, పాడాలని ఉంది వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను వెండి తెరకు పరిచయం చేశారు. Also Read:

SP Balu Death Anniversary: పాటగా బతకనా మీ అందరి నోట అంటూ.. దివికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..