AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni- Zainab: అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్‌ఎవరు? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

అక్కినేని అందగాడు అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మంగళవారం (నవంబర్ 26) జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కలిసి అతను ఉంగరాలు మార్చుకున్నాడు. దీంతో అసలు ఈ జైనాబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్స్.

Akhil Akkineni- Zainab: అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్‌ఎవరు? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Akhil Akkineni, Zainab Ravdjee
Basha Shek
|

Updated on: Nov 27, 2024 | 9:39 AM

Share

అక్కినేని వారి ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబర్ 04న అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హీరో నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే అఖిల్, జైనాబ్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ల ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో జైనాబ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. జైనాబ్ హైదరాబాద్ లో పుట్టినా ఎక్కువగా ఢిల్లీ, దుబాయ్, ముంబైలోనే పెరిగిందట. ప్రస్తుతం ముంబైలోనే నివాసముంటున్నట్లు సమాచారం. కాగా అఖిల్ తో ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే జైనాబ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చేసిందట. దీంతో ఆమె ఫొటోలు ఎక్కువగా బయటకు రావడం లేదు. అయితే జైనాబ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్ తదితర సినిమా తారలు ఫాలో అవుతున్నారు. ఇక జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, ఒక పెయింట్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. గతంలో ఆమె వేసిన పెయింట్స్ పలు పెయింట్ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

ప్రేమకు వయసుతో పనేముంది?

ఇదిలా ఉంటే అఖిల్, జైనాబ్ ల ఏజ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య సుమారు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ వయసు 30 కాగా.. జైనాబ్ కు 39 ఏళ్లు అని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జైనాబ్ వయసు 27 ఏళ్లేనని మరికొన్ని కథనాలు తెలిపాయి. అయినా ప్రేమకు వయసు ముఖ్యం కాదని, మనసులు కలవడం ముఖ్యమని అక్కినేని అభిమానులు కాబోయే దంపతులకు విషెస్ చెబుతున్నారు.

అక్కినేని నాగార్జున ట్వీట్..

కాగా నాగార్జున – జైనాబ్ తండ్రి జుల్ఫీ రవ్జీ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయట. వీరు మంచి స్నేహితులట. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్- జైనాబ్ ల పెళ్లికి అడుగులు పడ్డాయని తెలుస్తోంది. అయితే వీరిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..