Jailer Movie: యాక్షన్ సినిమాతో కడుపుబ్బ నవ్వించనున్న రజినీ..

అదేంటి మోహన్ లాల్ లేరు.. తమన్నా జాడ లేదు.. శివరాజ్ కుమార్ కనిపించలేదు.. జైలర్ ట్రైలర్ చూడగానే చాలా మందికి వచ్చిన అనుమానం ఇది. కానీ అలా అనుకునేవాళ్లకు దర్శకుడు నెల్సన్ చెప్పేదేంటో తెలుసా.. ఇంకా చాలా ఉన్నాయ్.. దాచేసాం లోపల.. రేపు చూస్తారుగా సినిమా రిలీజ్ అయ్యాక అని..! జైలర్‌లో పైకి కనిపించేదేదీ నిజం కాదు.. అసలు సినిమా లోపల ఇంకో చూపించబోతున్నారు రజినీ.

Jailer Movie: యాక్షన్ సినిమాతో కడుపుబ్బ నవ్వించనున్న రజినీ..
Jailer Movie
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 09, 2023 | 11:26 PM

కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు.. కనబడనిదంతా అబద్ధం కాదు.. అంతా మాయ అన్నాడో సినీ కవి. ఆయనేం అనుకుంటే మనకెందుకు కానీ.. ఇప్పుడెందుకీ ఈ వేదాంతం అనేగా మీ అనుమానం.. కాస్త ఆగండి అక్కడికే వస్తున్నాం. జైలర్ సినిమా ట్రైలర్ చూసి వామ్మో రజినీ ఈ సారి రక్తం ఏరులై పారించేలా ఉన్నారుగా అనుకుంటున్నారంతా. కానీ అసలు ట్విస్ట్ మరోటి ఉంది. అది తెలిస్తే అంతే ఇక.. మరి అదేంటో చూద్దామా..?

అదేంటి మోహన్ లాల్ లేరు.. తమన్నా జాడ లేదు.. శివరాజ్ కుమార్ కనిపించలేదు.. జైలర్ ట్రైలర్ చూడగానే చాలా మందికి వచ్చిన అనుమానం ఇది. కానీ అలా అనుకునేవాళ్లకు దర్శకుడు నెల్సన్ చెప్పేదేంటో తెలుసా.. ఇంకా చాలా ఉన్నాయ్.. దాచేసాం లోపల.. రేపు చూస్తారుగా సినిమా రిలీజ్ అయ్యాక అని..! జైలర్‌లో పైకి కనిపించేదేదీ నిజం కాదు.. అసలు సినిమా లోపల ఇంకో చూపించబోతున్నారు రజినీ.

జైలర్‌ను పూర్తిగా యాక్షన్ సినిమా అనుకుంటున్నారంతా. కానీ ఇందులో కడుపులు చెక్కలైపోయే కామెడీ ఉండబోతుంది. నిజానికి గత సినిమాల్లోనూ కామెడీకి పెద్దపీట వేసారు దర్శకుడు నెల్సన్. డాక్టర్, బీస్ట్ పేరుకు యాక్షన్ సినిమాలే కానీ.. అందులో కామెడీ సీన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. జైలర్ కూడా ఇదే ఫార్ములాలో వెళ్లబోతుంది. దీనికి తాజాగా విడుదలైన తమిళ ప్రోమోలే నిదర్శనం.

రజినీకాంత్ ఈ మధ్య ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేసిన సినిమాలేం లేవు. కానీ జైలర్‌తో ఆ లోటు తీరిపోవడం ఖాయం. ఓ వైపు యాక్షన్.. మరోవైపు హ్యూమర్ రెండింటినీ బ్యాలెన్స్ చేసారు నెల్సన్. ముఖ్యంగా యోగిబాబు, రజినీ మధ్య వచ్చే ట్రాక్ పేలుతుందని నమ్ముతున్నారు మేకర్స్. మొత్తానికి చాలా అంటే చాలా ఏళ్ళ తర్వాత రజినీ నుంచి వస్తున్న హిలేరియస్ కమ్ యాక్షన్ సినిమా జైలర్. ఆగస్ట్ 10న విడుదల కానుంది ఈ చిత్రం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చైతన్యతో శోభిత ప్రేమ ప్రయాణం.. ఎలా మొదలైందంటే..
చైతన్యతో శోభిత ప్రేమ ప్రయాణం.. ఎలా మొదలైందంటే..
హాఫ్ సెంచరీతో అద్భుతం.. కట్‌చేస్తే.. సచిన్, కోహ్లీ కంటే గ్రేట్
హాఫ్ సెంచరీతో అద్భుతం.. కట్‌చేస్తే.. సచిన్, కోహ్లీ కంటే గ్రేట్
ఓరేయ్.. పోతావ్ రేయ్.. ఇలాంటి చావు తెలివితేటలేంట్రా బాబు..! వీడియో
ఓరేయ్.. పోతావ్ రేయ్.. ఇలాంటి చావు తెలివితేటలేంట్రా బాబు..! వీడియో
రయ్ రయ్ అని బజాజ్ చేతక్‌పై దూసుకుపోతున్న ఈయన ఎవరో గుర్తుపట్టారా?
రయ్ రయ్ అని బజాజ్ చేతక్‌పై దూసుకుపోతున్న ఈయన ఎవరో గుర్తుపట్టారా?
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
రోహిత్, కోహ్లీ వారసులు వచ్చేశారు.. ఫ్యూచర్ మాదేనంటోన్న ఏడుగురు
రోహిత్, కోహ్లీ వారసులు వచ్చేశారు.. ఫ్యూచర్ మాదేనంటోన్న ఏడుగురు
ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం.. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్
ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం.. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్
కోహ్లీ, స్మిత్ ఇద్దరిలో ఎవరు ముందు చరిత్ర సృష్టించబోతున్నారు..?
కోహ్లీ, స్మిత్ ఇద్దరిలో ఎవరు ముందు చరిత్ర సృష్టించబోతున్నారు..?
నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఇండస్ట్రీలో చాలా స్పెషల్..
నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఇండస్ట్రీలో చాలా స్పెషల్..
ఫస్ట్ నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగాడు.. కట్ చేస్తే..
ఫస్ట్ నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగాడు.. కట్ చేస్తే..