Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Saamiranga: కీరవాణి అందమైన సాహిత్యం.. హృదయాలను దొచేస్తోన్న ‘ఇంకా ఇంకా దూరమే’ సాంగ్.. విన్నారా ?..

ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి సాంగ్ శ్రోతలను మైమరపించాయి. కీరవాణి అద్భుతమైన సంగీతం.. చంద్రబోస్ అందమైన లిరిక్స్ కట్టిడేశాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు.

Naa Saamiranga: కీరవాణి అందమైన సాహిత్యం.. హృదయాలను దొచేస్తోన్న 'ఇంకా ఇంకా దూరమే' సాంగ్.. విన్నారా ?..
Inka Inka Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2024 | 5:00 PM

ఈ సంక్రాంతికి నా సామిరంగ అంటూ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు అక్కినేని నాగార్జున. ఘోస్ట్ తర్వాత చాలా కాలంపాటు గ్యాప్ తీసుకున్న కింగ్.. ఇప్పుడు మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‏తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి సాంగ్ శ్రోతలను మైమరపించాయి. కీరవాణి అద్భుతమైన సంగీతం.. చంద్రబోస్ అందమైన లిరిక్స్ కట్టిడేశాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక నిన్న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నా సామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

“ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే..

ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే..

తెలియనీ భావమేదో మనసులో తొంగి చూసి..

మౌనమే చెరిపివేస్తుంటే.. మాటలై పలకరిస్తుంటే..

నిన్ను చూసి.. నన్ను చూసి.. చెప్పాలని చెప్పాలని..

అనిపిస్తుందే ఏమని.. గతము తిరిగి రాదని..

రేపు అన్నదే లేదని ఇప్పడె ఇప్పుడె నీకు నేనని..

గతము తిరిగి రాదని రేపు అన్నదే లెదని..

ఇక్కడ ఇక్కడే నాకు నువ్వని”..

అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ శ్రోతల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి.. ఈ పాటను రాశారు. కీరవాణి అందించిన అందమైన సాహిత్యం.. అందుకు తగిన మ్యూజిక్ వినడానికి ఎంతో హాయిగా ఉంది. ఈ పాటను మమన్ కుమార్, సత్య యామిని కలిసి మరింత అందంగా ఆలపించారు. కీరవాణి సంగీత దర్శకుడిగానే కాకుండా మంచి లిరిసిస్ట్ కూడా. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిపై ఓ సాంగ్ రాశారు. అలాగే ఈసారి సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలపై ఓ సాంగ్ రాశారు. ఈ పాటను నిన్న నా సామిరంగ ప్రీ రిలీజ్ వేడుకలో రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.