Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన ఇండియన్ 2 పోస్టర్..

|

Nov 07, 2022 | 1:54 PM

ప్రస్తుతం రిలీజ్ అయిన భారతీయుడు 2 పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలకు పైనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన ఇండియన్ 2 పోస్టర్..
Indian 2
Follow us on

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇండియన్ 2. అనివార్య కారణాలతో రెండేళ్ల క్రితమే నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యింది. ఈ సినిమాతో టాలీవుడ్ చందమామా కాజల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. తాజాగా కమల్ హాసన్ బర్త్ డే (నవంబర్ 7) సందర్భంగా ఈ మూవీ నుంచి కమల్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. తాజా పోస్టర్ లో సేనాపతి పాత్రలో కనిపిస్తున్నారు కమల్. అందులో ఫుల్ అగ్రెసివ్ గా కనిపించారు.

ప్రస్తుతం రిలీజ్ అయిన భారతీయుడు 2 పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలకు పైనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. 1996లో కమల్, శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక చాలా కాలం తర్వాత ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.