K. Viswanath: విశ్వనాథ్ కెరీర్లో మొదటిసారి మాస్, క్రైమ్ ఓరియెంటెడ్ కథ.. ఫైట్స్ కోసం ఏం చేశారంటే..
ఆ తర్వాత వచ్చిన సిరిసిరి మువ్వ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. జేవీ సోమయాజులతో ఆయన చేసిన శంకరాభరణం సినిమా సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. సప్తపది.. ఆపద్భాంధవుడు.. స్వాతిముత్యం, స్వర్ణకమలం, శుభలేఖ, సిరివెన్నెల, సాగరసంగమం, స్వయం కృషి, స్వరాభిషేకం వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.
తెలుగు ప్రేక్షకులకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దిగ్గజ దర్శకులు.. రచయిత.. నటులు కాశీనాధుని విశ్వనాథ్. తెలుగు సినిమాలకు ఒక గౌరవాన్ని.. గుర్తింపును అందించి.. అద్భుతమైన కళా చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్విగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. భారతీయ కళా చిత్రాలను రూపొందించడంలో ఆయన ప్రత్యేకం. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సిరిసిరి మువ్వ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. జేవీ సోమయాజులతో ఆయన చేసిన శంకరాభరణం సినిమా సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. సప్తపది.. ఆపద్భాంధవుడు.. స్వాతిముత్యం, స్వర్ణకమలం, శుభలేఖ, సిరివెన్నెల, సాగరసంగమం, స్వయం కృషి, స్వరాభిషేకం వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే కళాత్మక నేపథ్యంలోనే సినిమాలను రూపొందించిన ఆయన మొదటిసారి మాస్.. క్రైమ్ ఓరియెంటెడ్ సినిమాను సృష్టించారు. క్లాసికల్ హీరోతో.. మాస్ మాసాలా చిత్రం తీసుకు వచ్చారు విశ్వనాథ్.
ఆయన కాలాంతకులు అనే ఓ క్రైమ్ ఓరియంటెడ్ మూవీ తీశారు. ఆ రోజల్లో శోభన్ ను అందరూ క్లాస్ హీరో అనేవారు. ఇక విశ్వనాథ్ కళకే విలువ ఇస్తూ సాగారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘కాలాంతకులు’ చిత్రం మాస్ మసాలాలతో రూపొందింది. అయితే అందులో గుర్రాలు ఫైట్లూ ఉండడంతో.. కెఎస్ఆర్ దాస్ గారిని తీసుకొచ్చి అవి తీయించుకుని దర్శకులలో తనతో సమానమైన స్తానాన్నిస్తూ ఆయన పేరూ వేయడం విశ్వనాథ్ సంస్కారానికి నిదర్శనం.
కళాతపస్వి విశ్వనాథ్ కథలకు తగిన హీరో శోభన్ బాబు. క్లాసికల్ హీరోగా పేరు సంపాదించుకున్న శోభన్ బాబు.. విశ్వనాథ్ కాంబోలో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ప్రైవేటు మాష్టారు చిత్రంలో చిన్నపాత్రలో శోభన్ బాబును నటింపచేసిన ఆయన.. ఆ తర్వాత నిండు హృదయాలు చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముని పాత్రలో కనిపించేలా చేశారు. ఆ తర్వాత శోభన్ బాబు పూర్తి స్థాయి హీరోగా చెల్లెలి కాపురం సినిమాను రూపొందించారు. ఇందులో శోభన్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వీరి కాంబోలో కాలం మారింది, శారద, జీవనజ్యోతి, ప్రేమబంధం, జీవితనౌక, కాలాంతకులు వంటి చిత్రాలు వచ్చాయి.