Allu Arjun : రాకీబాయ్ పై పుష్పరాజ్ కామెంట్స్.. కేజీఎఫ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఐకాన్ స్టార్..

ప్రస్తుతం ఎక్కడ చేసిన కేజీఎఫ్ సందడే కనిపిస్తుంది. కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Allu Arjun : రాకీబాయ్ పై పుష్పరాజ్ కామెంట్స్.. కేజీఎఫ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఐకాన్ స్టార్..
Allu Arjun , Yash
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2022 | 8:53 AM

ప్రస్తుతం ఎక్కడ చేసిన కేజీఎఫ్ సందడే కనిపిస్తుంది. కన్నడ రాక్ స్టార్ యష్(yash) నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ కలెక్షన్స్ సునామి క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూల్ చేసింది కేజీఎఫ్ 2. ఇక ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని భాషల సినిమా తారలు కేజీఎఫ్ పై హీరో యష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేజీఎఫ్ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించారు.

సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కేజీఎఫ్ చిత్రయూనిట్ ను అభినందించారు. కేజీఎఫ్ 2 కి భారీ అభినందనలు ..యష్ అద్భుతమైన నటన ఇంటెన్సిటీ సూపర్భ్. సంజయ్ దత్ జీ.. రవీనా జీ నటన అద్భుతంగా ఉంది. భువన్ గౌడ గారు.. టెక్నీషన్స్ అందరికి నా అభినందనలు. ప్రశాంత్ నీల్ గారి అద్భుతమైనస్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్  సూపర్.. ఆయన విజన్ కాన్విక్షన్ కి నా రెస్పెక్ట్ .. ఇండియన్ సినిమా  జెండాను ఎగరవేసినందుకు అందరికీ ధన్యవాదాలు“ అంటూ రాసుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలవ్వనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Aamna Sharif: అందాలతో ఫ్యాన్స్ హృదయాలను లాక్ చేస్తున్న ఆమ్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..