Allu Arjun: అల్లు అర్జున్ మామూలోడు కాదు..! గంగోత్రిలో కావాలని ఆ సీన్ పెట్టించాడట..
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ స్టైలిష్ స్టార్ కెరీర్ లో ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో, పుష్ప ఇలా చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ దెబ్బకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు షాక్ అయ్యారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. గంగోత్రి సినిమా దగ్గర నుంచి పుష్ప సినిమా వరకు వైవిద్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ స్టైలిష్ స్టార్ కెరీర్ లో ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో, పుష్ప ఇలా చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ దెబ్బకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు షాక్ అయ్యారట.
అల్లు అర్జున్ హీరోగా చేసిన తొలి సినిమా గంగోత్రి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో పాటు డాన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ దివంగత నటుడు ధర్మవరకు సుబ్రహ్మణ్యం హోస్ట్ గా చేశారు. ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిన్నప్పుడు ఓ ఫంక్షన్ లో బన్నీ డాన్స్ చూసి రాఘవేంద్రరావు ఒక వందరూపాయల నోటు పై సైన్ చేసి మీ అబ్బాయిని హీరోగా బుక్ చేస్తున్న అన్నారట. అదే నిజమైంది. అయితే గంగోత్రి సినిమా సమయంలో ఓ గమ్మత్తైన విషయం జరిగిందట. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ చాలా చిన్న కుర్రాడు. అయితే ఆ సినిమాలో నడుము పై పూలు , పండ్లు వేయిస్తారని అనుకున్నాడట. కానీ అవేమి లేకుండా రాఘవేంద్రరావు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయబోయారట .. అయితే వెంటనే బన్నీ రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఎదో మిస్ అవుతుంది. మీ సినిమాల్లో ఉండేది ఎదో ఈ సినిమాలో మిస్ అవుతుంది అని అన్నాడట. దాంతో రాఘవేంద్ర రావుకు విషయం అర్ధమై ఓ సీన్ ఉంది.. ఆ సీన్ లో హీరోయిన్ బొడ్డు పై పండు విసరలి.. కానీ నువ్వు ఫ్రెమ్ లో ఉండవు అని చెప్పారట. దాంతో బన్నీ ఆమె బొడ్డు పైకి కరెక్ట్ గా గురి చూసి విసిరాడట.. దాంతో ఆ సీన్ సింగిల్ టెక్ లో ఓకే అవ్వడంతో అందరూ క్లాప్స్ కొట్టారని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అలా బన్నీ దెబ్బకు రాఘవేంద్రరావు షాక్ అయ్యారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.