Baby: ఆకట్టుకుంటున్న దేవరాజా సాంగ్.. బేబీ సెకండ్ సింగిల్ మీరు విన్నారా ?..
శ్రోతలను మైమరపించే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బల్గానిన్ సంగీతం అందించారు. ఇక విడుదలైన వీడియో సాంగ్ లో ఎవరూ పట్టించుకోని విధంగా ఉండే ఊరికి చెందిన అమ్మాయి.. సిటీ అమ్మాయిగా ఎలా మారిందనేది చూపించారు.

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బేబీ. డైరెక్టర్ సాయి రాజేష్ రూపొందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘ఓ రెండు ప్రేమ మేఘలీలా..’ పాటకు వచ్చి రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇక నిన్న విడుదలైన సెకండ్ సింగిల్ దేవరాజా సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటను హ్యాపెనింగ్ సింగర్ ఆర్య దయాల్ పాడగా.. పాటకు ట్యూన్ కు సూపర్ గా సెట్ అయినట్లుగా అనిపిస్తోంది. శ్రోతలను మైమరపించే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బల్గానిన్ సంగీతం అందించారు. ఇక విడుదలైన వీడియో సాంగ్ లో ఎవరూ పట్టించుకోని విధంగా ఉండే ఊరికి చెందిన అమ్మాయి.. సిటీ అమ్మాయిగా ఎలా మారిందనేది చూపించారు.
ఈ సినిమాలో విరాజ్ అశ్వి్న్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ పాటతో మలయాళంకు చెందిన ఆర్య దయాల్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పటివరకు తన మ్యాజికల్ వాయిస్ తో పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పాటలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
