Pawan Kalyan: దూకుడు పెంచిన పవర్ స్టార్.. పవన్ కొత్త సినిమా కోసం భారీ కాలేజ్ సెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్  సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

Pawan Kalyan: దూకుడు పెంచిన పవర్ స్టార్.. పవన్ కొత్త సినిమా కోసం భారీ కాలేజ్ సెట్..
pawan-kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 3:23 PM

Pawan Kalyan:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్  సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.  సినిమాతోపాటు మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు పవన్.  ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక క్రిష్ ,సాగర్ చంద్ర సినిమాతోపాటు హరీష్ శంకర్ తాను సినిమా చేయబోతున్నాడు పవన్. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకావడం తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా  ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలు కీలకంగా ఉంటాయట. మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు.అలాగే ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన సెట్స్ కూడా వేయిస్తారట. ఈ సినిమా ఎక్కువ భాగం సెట్స్ లో కానిచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranveer Singh: డైలమాలో బాలీవుడ్ హీరో.. శంకర్ తో సినిమాపై క్లారిటీ తీసుకోనున్న రణ్ వీర్ సింగ్..

Priyadarshi Pulikonda: మరో విభిన్న కథతో రానున్న ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న పోస్టర్

NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్