హాలీవుడ్ స్టార్స్ ని బీట్ చేసిన బాలీవుడ్ అందగాడు …. హ్యాట్సాఫ్ టు హృతిక్ ..

హాలీవుడ్ స్టార్స్ ని మించినవాడు మన ఇండియాలోనే ఉన్నాడు. మనకు.. ముఖ్యంగా బాలీవుడ్ లో .. ‘ మెరిసే ‘ అందగాడెవరంటే.. ఆకు పచ్చని కళ్ళవాడు… గ్రీక్ గాడ్ లా కనిపించే ఆరడుగుల ఆజానుబాహుడు హృతిక్ రోషన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. 2018 నాటి ఓ అంచనా ప్రకారం.. వరల్డ్ లోని టాప్ మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్లలో హృతిక్ టాప్ లో ఉన్నాడు. హెన్రీ కెవిల్, క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ పాటిసన్ లాంటి హాలీవుడ్ నటులను బీట్ […]

హాలీవుడ్ స్టార్స్ ని బీట్ చేసిన బాలీవుడ్ అందగాడు .... హ్యాట్సాఫ్ టు హృతిక్ ..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 17, 2019 | 5:10 PM

హాలీవుడ్ స్టార్స్ ని మించినవాడు మన ఇండియాలోనే ఉన్నాడు. మనకు.. ముఖ్యంగా బాలీవుడ్ లో .. ‘ మెరిసే ‘ అందగాడెవరంటే.. ఆకు పచ్చని కళ్ళవాడు… గ్రీక్ గాడ్ లా కనిపించే ఆరడుగుల ఆజానుబాహుడు హృతిక్ రోషన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. 2018 నాటి ఓ అంచనా ప్రకారం.. వరల్డ్ లోని టాప్ మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్లలో హృతిక్ టాప్ లో ఉన్నాడు. హెన్రీ కెవిల్, క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ పాటిసన్ లాంటి హాలీవుడ్ నటులను బీట్ చేసిన ఇతని లుక్స్ కి అమ్మాయిలు ఫిదా కావలసిందే.. నటనలో, డ్యాన్సింగ్ లో ఇతనికితడే సాటి. 2016 లో ఈ ‘ ధూమ్-2 ‘ స్టార్ ని సెకండ్ సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్ గా ప్రకటించారు. ఆ తరువాతి సంవత్సరంలోనూ హృతిక్ ఇదే స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వరల్డ్ టాప్ మోస్ట్ వెబ్ సైట్ ఒకటి రేటింగులపరంగా.ప్రపంచంలోని అందగాళ్ళలో టాప్ లో ఎవరున్నారని ‘ ఆరా ‘ తీస్తే ఇతగాడే నిలిచాడు. సెలబ్రిటీల్లో బాక్సాఫీసు రేటింగ్స్, ఎండార్స్ మెంట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ తదితర అంశాల ఆధారంగా అన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే తేలిన నిజం ఇది.. ఇక కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఐదో స్థానంలో నిలిస్తే.. ట్విలైట్ స్టార్ రాబర్ట్ పాటి సన్, కెప్టెన్ అమెరికా మూవీ నటుడు క్రిస్ ఇవాన్స్ హృతిక్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. సూపర్ మ్యాన్ స్టార్ హెన్రీ కెవిల్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా.. జేమ్స్ బాండ్ స్టార్ టామ్ హిడిల్ స్టన్ తొమ్మిదో ప్లేస్ లో నిలిచాడు. మోడల్ గా కెరీర్ ను ఆరంభించి ‘ కహో న ప్యార్ హై ‘ చిత్రంతో ఆరంగేట్రం చేసిన హృతిక్ ఆ తరువాత వెనక్కి చూసుకోలేదు. 44 ఏళ్ళ వయస్సులోనూ ఇతని లుక్స్, వెర్సటైల్ స్కిల్స్.. అబ్బో అనిపించేలా ఉన్నాయని బాలీవుడ్ పత్రికలు రాసుకొచ్చాయి. ఇటీవలి ఇతని చిత్రం ‘ సూపర్ 30 ‘ రికార్డుల మోత మోగిస్తోంది. ఇంత ఫేమస్ అయినా.. ఈ ‘ ప్రశంసల జల్లు ‘ కు హృతిక్ రోషన్ ‘ సాదా సీదా ‘ గా స్పందించాడు. వరల్డ్స్ టాప్ మోస్ట్ హ్యాండ్సమ్ సెలబ్రిటీల్లో తాను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నానని వచ్చిన వార్తలపట్ల చిన్నగా నవ్వుతూ లైట్ గా తీసుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్టు మీదే దృష్టి అంటూ తప్పించుకున్నాడు.

.