Hrithik Roshan : వారెవ్వా.. ఇద్దరు కొడుకులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన హృతిక్ రోషన్.. వీడియో వేరేలెవల్..
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అలాగే దేశంలోనే బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో హృతిక్ రోషన్ ఒకరు. ఆయన స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. హృతిక్ డ్యాన్స్ యూత్ ఫిదా అవుతుంటారు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే వార్ 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రధాన పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో హృతిక్ రోషన్ ఒకరు. ఆయన డ్యాన్స్ స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. హృతిక్ డ్యాన్స్ ఫాలో అయ్యే అభిమానులు.. ఆయన స్పూర్తితో డ్యాన్స్ లో అదరగొట్టిన యూత్ ఎంతో మంది ఉన్నారు. చాలా కాలం తర్వాత రియల్ లైఫ్ లో మరోసారి తనదైన స్టెప్పులతో ఇరగదీశాడు హృతిక్ రోషన్. తాజాగా ఓ పెళ్ళిలోనూ తన ఇద్దరు కొడుకులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..
హృతిక్ రోషన్ మామయ్య తనయుడు ఇషాన్ రోషన్ పెళ్లి రెండు రోజుల క్రితం ముంబైలో జరిగింది. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు బంధువులతోపాటు బాలీవుడ్ సినీప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ వేడుకలో తన ప్రేయసి సబా ఆజాద్ తో కలిసి హృతిక్ సైతం సందడి చేశారు. అలాగే తన ఇద్దరు కొడుకులతో కలిసి హృతిక్ మాజీ బార్య సుస్సానే ఖాన్ సైతం పెళ్లిలో కనిపించింది. సంగీత్ సందర్భంగా తన ఇద్దరు కొడుకులతో కలిసి హ్రేహాన్, హృదాన్ తో కలిసి హిందీ పాటకు డ్యాన్స్ చేశారు హృతిక్.
ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..
ఇక హిందీ పాటకు తగినట్లుగా హృతిక్ డ్యాన్స్ అదరగొట్టాడు. హృతిక్ మాత్రమే కాదండోయ.. తన ఇద్దరు కొడుకులు సైతం డ్యాన్స్ ఇరగదీశారు. తండ్రితో పోటీపడి మరీ డ్యాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. త్వరలోనే హృతిక్ తనయులు సైతం సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..
Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p
— Hrithik Roshan (@iHrithik) December 25, 2025
ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..
