Save the Tigers: కడుపుబ్బా నవ్వించిన సిరీస్కు సీక్వెల్.. ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తోంది..
తెలుగులో వచ్చిన ఓ కామెడీ వెబ్ సిరీస్ ఊహించని స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. అదే 'సేవ్ ది టైగర్స్'. గతేడాది హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఇందులో జబర్ధస్త్ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, జబర్దస్త్ రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ కామెడీ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.
ఓటీటీలో ఒరిజినల్ కంటెంట్ చిత్రాలకు, వెబ్ సిరీస్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ డ్రామాలు చూసేందుకు అడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇతర భాషల నుంచి డబ్ అయిన క్రైమ్ థ్రిల్లర్.. హారర్ కంటెంట్.. లవ్ స్టోరీలకు ఇప్పుడు ఓటీటీలో ఆదరణ ఎక్కువైంది. దీంతో అలాంటి నేపథ్యంలో వెబ్ సిరీస్, మూవీస్ తీసుకువచ్చేందుకు ఓటీటీ మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఓటీటీలో కామెడీ సిరీస్ లు వస్తున్నాయి. తెలుగులో వచ్చిన ఓ కామెడీ వెబ్ సిరీస్ ఊహించని స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. అదే ‘సేవ్ ది టైగర్స్’. గతేడాది హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఇందులో జబర్ధస్త్ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, జబర్దస్త్ రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ కామెడీ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఇందులో కామెడీ కడుపుబ్బా నవ్వించింది.
ఈ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్కు ఇప్పుడు సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది హాట్ స్టార్. ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లుగా ఆ మధ్య పోస్టర్ షేర్ చేసింది. ఇక బుధవారం ఈ సిరీస్ సీజన్ 2 గురించి అఫీషియల్ పోస్ట్ చేసింది. ఫస్ట్ సీజన్ మార్చి 10 వరకు ఫ్రీగా చూడొచ్చని ఆఫర్ ఇచ్చింది. అంటే ఆ తర్వాత మార్చి మూడో వారంలో ఈ సీక్వె్ల్ రాబోతుందని అంటున్నారు ఫ్యాన్స్.
సేవ్ ది టైగర్స్ 2 అప్డేట్ ఇప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి మూడో వారంలో ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సీజన్ 2 సిరీస్ పై అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి ఇన్నాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సిరీస్ ఇప్పుడు మరోసారి కొత్తగా రాబోతుంది..
Save The Tigers S2 is on its way! And now you can binge-watch the first season for FREE until March 10 🙌
Get going, Tigers 🐅 #SaveTheTigersAgain coming soon only on #DisneyPlusHotstar
Link – https://t.co/alAtoK4Ycq@mahivraghav @PradeepAdvaitam @PriyadarshiPN… pic.twitter.com/3ZOAz1zls1
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.