AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: 10 కోట్లతో తీస్తే 1000 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కొత్త సినిమా.. ఇంతకీ ఏముందీ మూవీలో

మొన్నటివరకు ధురంధర్ ది రివేంజ్, మైఖెల్ లాంట సినిమాలతో బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఇప్పుడు మరో కొత్త సినిమా నమ్మశక్యం కానీ వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Cinema: 10 కోట్లతో తీస్తే 1000 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కొత్త సినిమా.. ఇంతకీ ఏముందీ మూవీలో
Cinema
Basha Shek
|

Updated on: May 25, 2026 | 6:58 PM

Share

తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ప్రపంచ సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశం నుంచి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్ (ధురందర్ 2) సంచలన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కినప్పటికీ మూవీ దాదాపు రూ. 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక హాలీవుడ్ లో అయితే ‘మైఖేల్’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా వీటన్నింటినీ వెనక్కు నెట్టింది. మే 15న విడుదలైన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ మూవీ బడ్జెట కేవలం 10 కోట్ల లోపే. అంటే కేవలం వారం రోజుల్లోపే పెట్టిన పెట్టుబడిపై 10,000 శాతానికి పైగా లాభాలను అర్జించిన ఈ మూవీ ఈ ఏడాది అత్యంత లాభదాయకమైన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

హాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా అబ్సెషన్. హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మైఖేల్ జాన్‌స్టన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇండీ నవరెట్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఉత్కంఠ రేపే సీన్లు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చుండేలా చేస్తోంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. బెయిర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే ఓ మ్యూజిక్ స్టోర్ ఉద్యోగికి ఒక అతీత శక్తులున్న వింత బొమ్మ దొరుకుతుంది. తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండీ నవరెట్) తనతో ప్రేమలో పడాలని ఆ బొమ్మను కోరుతాడు. బెయిర్ కోరిక తీరినప్పటికీ, దాని వల్ల అతడి జీవితంలో భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటాడు. మరి అవేంటి? చివరకు బెయిర్ ఏమయ్యాన్నదే ఈ సినిమా కథ. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రన్ అవుతోంది. పూర్తి స్థాయి రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అబ్సెషన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
ఫెంగ్ షుయ్ వాస్తు.. ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకుంటే డబ్బే డబ్బు..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు
వాస్తు ప్రకారం ఈ వస్తువులను చేతికి ఇవ్వడం అశుభం.. లేకపోతే నష్టాలు