AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదంతా అబద్దం.. అగ్నిపరీక్షలో అసలు జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సైతం హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లడానికి ముందే టాస్కుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు.

అదంతా అబద్దం.. అగ్నిపరీక్షలో అసలు జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన కంటెస్టెంట్
Agnipariksha Season 2 Bebja
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2026 | 7:31 AM

Share

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రస్తుతం తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొని ఎలిమినేట్ అయ్యిన వారు చాలా మంది బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ బాలు బయటకు వచ్చి సంచలన కామెంట్స్ చేశాడు. జడ్జ్ లుగా ఉన్న నవదీప్, బిందుమాధవి తనను అవమానించారని చెప్పి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అలాగే మరో కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె ఎవరో కాదు బెబ్జాన్. ఈ అమ్మడు అగ్నిపరీక్షలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. పాల్గొన్న బెబ్జాన్ తన వ్యక్తిగత జీవితం, రియాలిటీ షో అనుభవాలు చెప్పుకొచ్చింది.

బెబ్జాన్ తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ..ఒక బంధం ముగిసిన తర్వాత ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని, “టు బీ ఫ్రాంక్, ఇప్పుడే బాగున్నా” అని ఆమె స్పష్టం చేశారు. బ్రేకప్ అయినప్పుడు జీవితంపై ఆశ కోల్పోయానని, కుటుంబం కోసమే బతికాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు లైఫ్ మీద కూడా హోప్ లేకుండా ఉండే” స్థాయికి చేరుకున్నానని, ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించారు. అయితే, ఆ దశను అధిగమించి, సింగిల్‌గా ఉండటం ప్రారంభించిన తర్వాత తనని తాను కనుగొన్నానని చెప్పుకొచ్చింది.

గతంలో అమాయకురాలిగా, లోకం తెలియని వ్యక్తిగా ఉండేదాన్ని అని, కానీ బ్రేకప్ తర్వాత వ్యక్తిత్వ వికాసం చెందిందని బెబ్జాన్ పేర్కొన్నారు.  అలాగే బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి వస్తున్న ఆరోపణలపైనా బెబ్జాన్ స్పందించారు. కొంతమందికి డబ్బు చెల్లిస్తే ఆఫర్లు ఇప్పిస్తారని వస్తున్న నకిలీ కాల్స్ గురించి అడగ్గా.., అలాంటివి తనకు రాలేదని, అవి బహుశా ఫేక్ అయి ఉండవచ్చని ఖండించింది ఆమె. ఈ షో నిజాయితీగా జరుగుతుందని, “అఫ్ కోర్స్ జెన్యూన్‌గానే జరుగుతుంది” అని ఆమె చెప్పుకొచ్చింది. జడ్జ్‌లు టైమ్ ఇవ్వకుండా కొందరిని పంపించారనే వాదనలపైనా ఆమె వివరణ ఇచ్చింది. “జడ్జెస్‌కు ఒక వైబ్ ఉంటుంది,” ఆ వైబ్ మ్యాచ్ అయితేనే వారు సమయం ఇస్తారని, ఫేవరిజం ఏమీ ఉండదని, కేవలం వ్యక్తిగత “వైబ్” ఆధారంగానే ఎంపిక జరుగుతుందని ఆమె అన్నారు. “జడ్జెస్‌కి ఎవరు నచ్చారో వాళ్ళనే తీసుకుంటారు కదా,” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us