Jr.NTR-RRR: జూనియర్ ఎన్టీఆర్‏కు అవార్డ్ పంపిస్తున్న హెచ్‏సీఏ.. తారక్‏తోపాటు మరొకరి కూడా అంటూ ట్వీట్..

అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమ సత్తాను నలుమూలలకు చాటుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ యూఎస్ లో సందడి చేస్తుంది. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అనౌన్స్ చేసిన స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నారు.

Jr.NTR-RRR: జూనియర్ ఎన్టీఆర్‏కు అవార్డ్ పంపిస్తున్న హెచ్‏సీఏ.. తారక్‏తోపాటు మరొకరి కూడా అంటూ ట్వీట్..
Rrr
Follow us

|

Updated on: Mar 03, 2023 | 1:48 PM

గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు మారుమోగుతోంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపై హాలీవుడ్ సినీ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు విదేశీయులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో భారీగా వసూళ్లు రాబట్టి సత్తా చాటిన ట్రిపుల్ ఆర్.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమ సత్తాను నలుమూలలకు చాటుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ యూఎస్ లో సందడి చేస్తుంది. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అనౌన్స్ చేసిన స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నారు.

అయితే ట్రిపుల్ ఆర్ చిత్రంలో చరణ్‏తో అత్యద్భుతమైన నటన కనబరిచిన ఎన్టీఆర్‏కు అవార్డ్ రాకపోవడంపై తారక్ ఫ్యాన్స్ హెచ్‏సీఏ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తీసుకువచ్చి హెచ్‏సీఏను ప్రశ్నిచగా.. చరణ్‏కు కూడా అవార్డ్ వచ్చిందని.. కానీ తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఆయన అమెరికాకు రాలేకపోయినట్లు తమకు తెలిపారని వివరణ ఇచ్చింది హెచ్‏సీఏ. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన అవార్డుల ట్రోపీలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ట్రిపుల్ ఆర్ సినిమాకు గానూ.. బెస్ట్ స్పాట్ లైట్ అవార్డ్స, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తారక్‏కు వచ్చినట్లు తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తారక్ తోపాటు.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‍కు కూడా హెచ్ సీఏ అవార్డ్ వచ్చిందని తెలిపింది. వీరిద్దరికి సంబంధించిన అవార్డు ట్రోపీలను ట్వీట్టర్ వేదికగా పంచుకుంది.

“డియర్ ఆర్ఆర్ఆర్ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ ఇద్దరికి వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాం. వచ్చే వారం ఈ అవార్డులను వారికి పంపిస్తున్నాం” అంటూ ట్వీట్ చేసింది హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అసోసియేషన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..