Bigg Boss: బిగ్ షాక్.. ఇక పై బిగ్ బాస్ హౌస్‌లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ..?
బిగ్బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తొలినాళ్లల్లో సినిమా, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాల్టీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు.. వెంటనే బిగ్బాస్ షోలోకి పట్టుకోస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు..

తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈసారి అలా ఉండదని తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ కు నో ఎంట్రీ అని టాక్ వినిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది అంటే చాలు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ అలర్ట్ అవుతారు. తమ టాలెంట్ అంతా బయట పెట్టి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటే బిగ్ బాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడని అంతా అనుకుంటారు.. అలాగే జరిగింది కూడా.. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండదని తెలుస్తుంది. ఇక పై సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్, ఇన్ స్టా సెలబ్రెటీలు తీసుకోకూడదని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తుంది.
అయితే ఇది మన తెలుగు బిగ్ బాస్ కాదు.. బాలీవుడ్ బిగ్ బాస్. హిందీలో ఇప్పటికే 18 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 19లో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ తీసుకోకూడదని నిర్ణయించారట.. కేవలం హిందీ టెలివిజన్ నటీ నటులను మాత్రమే హౌస్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పడం ఖాయం అంటున్నారు. ఇక ఇదే నిర్ణయాన్ని తెలుగు బిగ్ బాస్ కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




