Rashmika: రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో వైరల్.. ఈసారి మరింత దిగజారి

ట్రోల్స్ రూపంలో .. రకరకాల ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలతో హీరోయిన్స్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు హీరోయిన్స్ కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. వేరే వాళ్ళ బాడీకి హీరోయిన్స్ ముఖాన్ని యాడ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా ఎడిట్ చేస్తున్నారు.

Rashmika: రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో వైరల్.. ఈసారి మరింత దిగజారి
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2024 | 4:17 PM

ఇటీవల డీప్‌ఫేక్ వీడియోలతో సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీలు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రోల్స్ రూపంలో .. రకరకాల ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలతో హీరోయిన్స్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు హీరోయిన్స్ కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. వేరే వాళ్ళ బాడీకి హీరోయిన్స్ ముఖాన్ని యాడ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా ఎడిట్ చేస్తున్నారు. అలా జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రయోజనం లేదు. ఇక ఇప్పుడు రష్మిక మందన్నకు సంబంధించిన మరో డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారింది.

గతంలో రష్మిక మందన్నపై చేసిన ఫేక్ వీడియో కారణంగా డీప్‌ఫేక్ వీడియోపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఓ యువతి పొట్టి డ్రెస్‌లో లిఫ్ట్‌ ఎక్కిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న యువతికి రష్మిక మందన్న ముఖాన్ని యాడ్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీని పై రష్మిక మందన్న కూడా స్పందించింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో సహా పలువురు సెలబ్రిటీలు దీనిపై సీరియస్ అయ్యారు. ఇలాంటివి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పుడు రష్మిక మరో డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖంను ఎడిట్ చేశారు. ఈ వీడియోపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో చేయవద్దు’ అని రష్మిక మందన్న అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు పోలీసుల ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది ఈ చిన్నది. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తుంది రష్మిక మందన్న.

రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.