Dolly Sohi: సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి.! అదే కారణమా.?

Dolly Sohi: సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి.! అదే కారణమా.?

Anil kumar poka

|

Updated on: Mar 12, 2024 | 4:05 PM

టెలివిజన్ నటి డాలీ సోహి ముంబైలో కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

టెలివిజన్ నటి డాలీ సోహి ముంబైలో కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు’ అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. హిందీలో పలు సీరియల్స్‌లో నటించిన డాలీ చివరిసారి గతేడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా.. సులభం అవుతుంది. క్యాన్సర్‌ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా.. లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది’ అని అందరిలో ధైర్యాన్ని నింపారు. హిందీలో ‘ఝనక్’, ‘మేరీ ఆషికీ తుమ్సే హి’ వంటి సీరియల్స్‌తో డాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఆమె మరణంతో హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos