Sparrow Worship: మహాశివరాత్రి వేళ అద్భుతం.. పరమేశ్వరుడికి పిచ్చుక పూజలు.!
ఈ ప్రకృతి ఎన్నో జీవజాతులతో నిండి ఉంది. మానవులు, పశుపక్ష్యాదులు, జంతువులు. మహావృక్షాలు, అడవులతో ప్రకృతి తులతూగుతూ ఉంటుంది. తమను సృష్టించిన భగవంతునిపై మానవాళిమాత్రమే కాదు పశుపక్ష్యాదులు సైతం కృతజ్ఞతను కలిగి ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో భగవంతునిపై తమ భక్తిని కృతజ్ఞతను చాటుకుంటాయి. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట చూశాం.
ఈ ప్రకృతి ఎన్నో జీవజాతులతో నిండి ఉంది. మానవులు, పశుపక్ష్యాదులు, జంతువులు. మహావృక్షాలు, అడవులతో ప్రకృతి తులతూగుతూ ఉంటుంది. తమను సృష్టించిన భగవంతునిపై మానవాళిమాత్రమే కాదు పశుపక్ష్యాదులు సైతం కృతజ్ఞతను కలిగి ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో భగవంతునిపై తమ భక్తిని కృతజ్ఞతను చాటుకుంటాయి. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట చూశాం. వానరాలు, నాగుపాములు, ఆవులు, ఆలయాల్లో ప్రదక్షిణ చేయడం మనం చూశాం. తాజాగా ఓ చిన్న పిచ్చుక పరమేశ్వరుని పూజించి తన భక్తిని చాటుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పిచ్చుకలు ఇంట్లో సంచరిస్తే శుభం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అందుకే గుమ్మం ముందు వరి దుబ్బులను పిచ్చుకల కోసం వేలాడదీస్తారు. అలాంటిది మహాశివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోని పూజామందిరంలోకి నేరుగా వెళ్లింది పిచ్చుక. అక్కడ పరమశివుని పూజకోసం ఏర్పాటు చేసిన పూజా ద్రవ్యాలను పరికించి చూసింది. అక్కడి దేవుని చిత్రపటానికి ఎదురుగా నిలిచి మౌనంగా ప్రార్ధించింది. పూజాద్రవ్యాలన్నింటితో మానస పూజ చేసింది. ఆ ఇంట్లోని వారు పిచ్చుకను పూజాగదిలో చూసి ఆశ్చర్యపోయారు. మనుషుల అలికిడి వినిపించినా ఆ పిచ్చుక అక్కడినుంచి వెళ్లకుండా చాలా సమయం అక్కడే ఉండటం గమనించి భగవంతుని లీలగా భావించారు. అనంతరం కొద్ది సమయం తర్వాత తన పూజ అయిపోయింది అన్నట్టుగా అక్కడినుంచి పిచ్చుక వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతా శివలీల అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos