Crime: 10 ఏళ్ల నాటి కేసులో ఆ 8 మందికి మరణశిక్ష – యూపీ కోర్టు సంచలన తీర్పు.!
దొంగతనానికి వచ్చి ఆదాయ పన్నుశాఖ ఇన్‌స్పెక్టర్ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చిన కేసులో 8 మందికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ కోర్టు మరణ శిక్ష విధించింది. మరణ శిక్ష పడిన వారంతా ఖైమర్ హసీన్ గ్యాంగ్ సభ్యులు. బరేలీలోని సురేశ్ శర్మ నగర్‌లో పదేళ్ల కిందట ఈ ఘటన జరిగింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రత్యేక జడ్జి రవికుమార్ దివాకర్ నిందితులకు మరణ శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.
దొంగతనానికి వచ్చి ఆదాయ పన్నుశాఖ ఇన్‌స్పెక్టర్ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చిన కేసులో 8 మందికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ కోర్టు మరణ శిక్ష విధించింది. మరణ శిక్ష పడిన వారంతా ఖైమర్ హసీన్ గ్యాంగ్ సభ్యులు. బరేలీలోని సురేశ్ శర్మ నగర్‌లో పదేళ్ల కిందట ఈ ఘటన జరిగింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రత్యేక జడ్జి రవికుమార్ దివాకర్ నిందితులకు మరణ శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. దొంగలు దోచుకున్న బంగారాన్ని కొనుగోలు చేసిన బంగారు వ్యాపారికి యావజ్జీవ శిక్ష పడింది. పీలీభీత్‌లో రవికాంత్ మిశ్ర ఆదాయ పన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 2014 ఏప్రిల్ 21 ఉదయం 9 గంటలకు ఆయన బరేలీలోని ఇంటి నుంచి పీలీభీత్ వెళ్లారు. 23వ తేదీన ఆయన తిరిగి వచ్చేసరికి గేటు లోపలి నుంచి తాళం వేసి ఉంది. కిటీకీ తెరిచి ఉంది. గ్రిల్స్ తొలగించి ఉన్నాయి. టెర్రస్ తలుపు తెరిచి ఉంది. పక్కన నిర్మిస్తున్న భవనంపై నుంచి ఆయన తన ఇంట్లోకి చూడగా తన 70ఏళ్ల తల్లి పుష్ప మెట్లపై విగత జీవిగా పడి ఉన్నారు. ఆయన సోదరుడు యోగేశ్, మరదలు ప్రియ మృత దేహాలు బెడ్‌రూంలో పడి ఉన్నాయి. ఇంటిని దుండగులు దోచుకున్న ఆనవాళ్లు కనిపించాయి. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో బంగారు వ్యాపారి ఉన్నారు.
నిందితులు పక్కన నిర్మిస్తున్న ఇంట్లో నుంచి మిశ్ర నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను హతమార్చి బంగారాన్ని, ఇంట్లో వస్తువులను దోచుకున్నారు. దొంగల అలజడి విని లేచిన పుష్పను ఇటుకతో కొట్టి చంపారు. మిగతా ఇద్దరిని గడ్డపారతో హతమార్చారు. 2014 మే 2వ తేదీన నిందితుల స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు.. నిందితులైన వాజిద్, హసీన్, యాసిన్ అలియాస్ జీషన్, నజీమా, హషీమా, సమీర్ అలియాస్ సాహిబ్, జుల్ఫాం, ఫాహింలకు మరణ శిక్ష విధించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos