Male Robot: రోబో.. వంకర బుద్ధి.! మహిళను అసభ్యంగా తాకిన వీడియో వైరల్..
సౌదీ అరేబియాలోని మొదటి పురుష మానవరూప రోబో వివాదాస్పద చర్చకు దారితీసింది. ఒక మహిళా రిపోర్టర్ ను రోబో అనుచితంగా తాకడం ఇందుకు కారణమయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబో పక్కన నిల్చొని సదరు మహిళ రిపోర్టింగ్ చేస్తుండగా ఎడమ చేతితో మహిళను రోబో అనుచితంగా తాకింది. రోబో తొలి ప్రదర్శన సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
సౌదీ అరేబియాలోని మొదటి పురుష మానవరూప రోబో వివాదాస్పద చర్చకు దారితీసింది. ఒక మహిళా రిపోర్టర్ ను రోబో అనుచితంగా తాకడం ఇందుకు కారణమయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబో పక్కన నిల్చొని సదరు మహిళ రిపోర్టింగ్ చేస్తుండగా ఎడమ చేతితో మహిళను రోబో అనుచితంగా తాకింది. రోబో తొలి ప్రదర్శన సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ వీడియో క్లిప్పింగ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా రోబో విఫలమైందని, సాధారణ పనితీరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఏఐ రోబోకి ఎవరు శిక్షణ ఇచ్చారని మరో వ్యక్తి ప్రశ్నించాడు. అయితే సాధారణ కదలికలో భాగంగానే చేతిలో మూమెంట్ కనిపించిందని మరికొందరు సమర్థిస్తున్నారు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. ‘ఇది రోబో తప్పు కాదు. మానవుల తప్పు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. కేవలం ఒక్క రోజులోనే 840,000 వ్యూస్ వచ్చాయి. కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన డీప్‌ఫాస్ట్ రెండవ ఎడిషన్‌లో ఈ హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సౌదీ పురోగతిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఒక జాతీయ ప్రాజెక్ట్‌గా ఈ రోబోను రూపొందించారు. అల్ అరేబియా బ్రాడ్‌కాస్టర్ నయీఫ్ అల్ అహ్మరీ మోడల్ వాయిస్‌తో రోబో తనను తాను పరిచయం చేసుకుందని వార్తా సంస్థ ‘అల్ అరేబియా’ కథనం పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

