Vishwak Sen: డిజిటల్ వరల్డ్‌లో రఫ్ఫాడించడానికి రేడే అవుతున్న మాస్ కా దాస్
తాజాగా మరో క్రేజీ హీరో కూడా ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, నాగార్జున లాంటి వాళ్లు ఓటిటిలో సత్తా చూపిస్తుంటే.. నేనున్నానంటూ మరో యంగ్ సెన్సేషన్ పోటీగా వచ్చేస్తున్నారు.

ఓటిటి వచ్చాక హీరోలకు ఆదాయం బాగా పెరిగిపోయింది. వద్దన్నా డబ్బులు వచ్చేస్తున్నాయి.. వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే డిజిటల్‌లోనూ కోట్లు వెనకేసుకుంటున్నారు మన స్టార్స్. తాజాగా మరో క్రేజీ హీరో కూడా ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, నాగార్జున లాంటి వాళ్లు ఓటిటిలో సత్తా చూపిస్తుంటే.. నేనున్నానంటూ మరో యంగ్ సెన్సేషన్ పోటీగా వచ్చేస్తున్నారు. బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఓటిటిలోకి వస్తారని.. అన్‌స్టాపబుల్ లాంటి టాక్ షోకు హోస్ట్ అవుతారని ఎవరైనా ఊహించారా..? కానీ వచ్చారు.. దుమ్ము దులిపేసారు.. బాలయ్య దెబ్బకు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది అన్‌స్టాపబుల్. అంతేకాదు బాలయ్య మార్కెట్ కూడా భారీగానే పెరిగింది ఈ షోతో. ఇదే దారిలో ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా హోస్ట్ అవుతున్నారు.. అది కూడా ఆహాలోనే.
ఆహాలో త్వరలోనే ఓ స్పెషల్ ఫిక్షనల్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కాస్త గమ్మత్తుగా ఉండే ఆ షోకు హోస్ట్‌గా విశ్వక్ సేన్ అయితే బాగుంటారని మేకర్స్ భావిస్తున్నారు. 15 ఎపిసోడ్స్‌తో సీజన్ 1 ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వరస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్.. షూటింగ్ గ్యాప్‌లో ఈ షోకు డేట్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన కంటే ముందు.. రానా సైతం ఓటిటిలో రప్ఫాడించారు.
తెలుగులో ఓటిటి హోస్టింగ్‌కు రానా గురువు లాంటి వాడు. ఆయన తర్వాతే బాలయ్య వచ్చారు. నాగార్జున సైతం ఓటిటిలో రప్ఫాడిస్తున్నారు. బిగ్ బాస్‌కు ఈయన బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అలాగే బుల్లితెరపై ఎన్టీఆర్, చిరంజీవి, నాని లాంటి హీరోలు హోస్టులుగా మెప్పించారు. మొత్తానికి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ వరల్డ్‌లోనూ సంపాదిస్తున్నారు మన హీరోలు.




