Baby Movie: సూపర్ హిట్‌గా బేబీ.. మూవీకి ప్రాణంగా నిలిచిన మ్యూజిక్
సంగీతంతో రాళ్లు కూడా కరిగించొచ్చు అంటారు కదా.. అలాగే సినిమాలో మంచి పాటలుంటే ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటున్నారు మేకర్స్. దానికి ప్రమోషన్ కూడా తోడైతే కలెక్షన్స్ పంట పండటం ఖాయం. దీనికి బేబీ సినిమానే నిదర్శనం.

మంచి పాటలు సినిమాను నిలబెడతాయా..? కంటెంట్ రొటీన్‌గా ఉన్నా.. థియేటర్స్‌కు ఆడియన్స్‌ను రప్పిస్తాయా..? నిజంగా మ్యూజిక్ అంత మ్యాజిక్ చేస్తుందా..? అయినా ఈ రోజుల్లో పాటల కోసం సినిమా చూడ్డానికి ఎవరు వస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇది వర్కవుట్ అయింది.. అవుతుంది.. ఇంకా అవుతూనే ఉంది. ఈ మధ్య కొన్ని సినిమాలు కేవలం మ్యూజిక్‌తోనే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. సంగీతంతో రాళ్లు కూడా కరిగించొచ్చు అంటారు కదా.. అలాగే సినిమాలో మంచి పాటలుంటే ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటున్నారు మేకర్స్. దానికి ప్రమోషన్ కూడా తోడైతే కలెక్షన్స్ పంట పండటం ఖాయం. దీనికి బేబీ సినిమానే నిదర్శనం. చిన్న సినిమానే అయినా.. ఫస్ట్ డే 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బేబీ. దీనికి ప్రధానమైన కారణం సినిమాలోని పాటలు.. చేసిన ప్రమోషన్.
బేబీ సినిమాకు విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలే అంచనాలు పెంచేసాయి. ఇదొక్కటే కాదు.. గతేడాది సీతా రామం విజయంలో కీలక పాత్ర పోషించింది పాటలే. అందులో ఒక్కో పాట మ్యూజిక్ లవర్స్ గుండెల్లోకి అలా వెళ్లిపోయాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే అద్బుతం అంతే.
ధమాకా సినిమాకు పాటలే బాగా హెల్ప్ అయ్యాయి. కంటెంట్ పరమ రొటీన్ అయినా.. పాటల్లో శ్రీలీల, రవితేజ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది. అలాగే రోషన్ హీరోగా పరిచయమైన పెళ్లి సందడి సినిమాను నిలబెట్టింది కూడా మంచి పాటలే. కీరవాణి ఈ సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసారు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలో కూడా పాటలు అద్భుతంగా ఉంటాయి. ఓపెనింగ్స్‌కు ఈ మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. ఇక యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు నీలినీలి ఆకాశం పాటే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఆల్బమ్ కూడా రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకొచ్చింది.




