Kanguva: కంగువ నుంచి సూర్య క్రేజీ పోస్టర్.. ట్రెండీ లుక్‌లో అడగరగొట్టిన స్టార్ హీరో

సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. కంగువ సినిమా పై సూర్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సూర్య నటిస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఫ్యాన్స్ అంతా సూర్య సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Kanguva: కంగువ నుంచి సూర్య క్రేజీ పోస్టర్.. ట్రెండీ లుక్‌లో అడగరగొట్టిన స్టార్ హీరో
Kanguva
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2024 | 3:12 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య విభిన్నమైన సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సూర్య. ఇక ఇప్పుడు సూర్య మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. కంగువ సినిమా పై సూర్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సూర్య నటిస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఫ్యాన్స్ అంతా సూర్య సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ సినిమాను ఏకంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది.

అంతే కాదు కంగువ సినిమాను త్రీడీ ఫార్మేట్ లో తీసురానున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో సూర్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సూర్య సినిమానుంచి మరో లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తాజాగా సూర్య సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో సూర్య అదరగొట్టారు. ఈ లుక్ అచ్చం 24 సినిమాలో ఆత్రేయలా ఉంది. ట్రెండీ లుక్‌ అదరగొట్టారు సూర్య. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. విధి.. కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్.. కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే కంగువ  అనే క్యాప్షన్ ఇచ్చారు.

సూర్య ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.