Gunturu Kaaram: సూపర్ స్టార్ క్రేజ్.. థియేటర్స్‌లో బుడ్డోడి రచ్చ.. మహేష్ బాబు అని అరుస్తూ..

జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో చిత్రం ఇది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన  సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్టే గుంటూరు కారం సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది.

Gunturu Kaaram: సూపర్ స్టార్ క్రేజ్.. థియేటర్స్‌లో బుడ్డోడి రచ్చ.. మహేష్ బాబు అని అరుస్తూ..
Gunturu Kaaram
Follow us
Srikar T

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 16, 2024 | 2:07 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో చిత్రం ఇది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన  సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్టే గుంటూరు కారం సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మహేష్ బాబు సినిమా వస్తుంటే చాలు అభిమానుల్లో ఆనందం పీక్స్ కు చేరుతుంది. థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మామూలుగా ఉండదు. థియేటర్స్ ను ఫ్లెక్సీ లతో నింపేస్తారు ఫ్యాన్స్. కటౌట్స్, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హంగామా చేస్తారు. ఇక థియేటర్స్ లోపల కూడా ఇదే రేంజ్ సందడి కనిపిస్తుంది. మహేష్ బాబు పేరు కనిపించినా కూడా ఫ్యాన్స్ ఈలలు గోలలతో థియేటర్ ను దద్దరిల్లేలా చేస్తారు.

గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోనూ ఇదే సందడి. థియేటర్స్ మొత్తాన్ని పేపర్లతో నింపేశారు ఫ్యాన్స్. మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కాగితాల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఓ బుల్లి సూపర్ స్టార్ ఫ్యాన్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థియేటర్ లో స్క్రీన్ మీద మహేష్ బాబు కనిపించగానే ఆ బుడతడు కాగితాలు విసిరేస్తూ.. మహేష్ బాబు అంటూ అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చి రాని మాటలతో ఆ చిన్నారి మహేష్ బాబు అంటూ అరుస్తున్నవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మహేష్ కు ప్రతిఒక్కరు ఫ్యాన్సే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు..

 మహేష్ బాబు చిన్నారి ఫ్యాన్ ..

గుంటూరు కారం ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.