AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: విక్రమ్ 2 లో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో సూర్య.. ఏమన్నాడంటే

గతకొంతకాలంగా కమల్ హాసన్ హిట్స్ లేక సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Suriya: విక్రమ్ 2 లో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో సూర్య.. ఏమన్నాడంటే
Hero Surya
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2022 | 5:45 PM

Share

ఇటీవల కాలంలో సూపర్ హిట్స్‌గా నిలిచిన సినిమాల్లో గట్టిగా వినిపించిన పేరు విక్రమ్. చాలా కాలం తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. గతకొంతకాలంగా కమల్ హాసన్ హిట్స్ లేక సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమా ఉంహించిన దానికంటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయిన విక్రమ్ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. లోకేష్ స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా చివరి ఐదు నిమిషాల్లో వచ్చిన సీన్ మరింత హైలెట్‏గా నిలిచింది. రోలెక్స్ పాత్ర ఎంట్రీతో థియేటర్లలో ఒక్కసారిగా రచ్చ చేశారు అభిమానులు. రోలెక్స్ అంటూ అరుపులతో నానా హంగామా చేశారు. కేవలం ఐదు నిమిషాలు ఉన్న సీన్ సినిమా మొత్తానికి కావాల్సిన స్టఫ్ అందింది. కేవలం రోలెక్స్ పాత్ర ద్వారా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించింది స్టార్ హీరో సూర్య. సూర్యను మెయిన్ విలన్ గా చూపించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు లోకేష్. ఇక ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సీక్వెల్ లో సూర్య విలన్ గా నటిస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు హీరో సూర్య.

తాజాగా ఓ ఇంట్రవ్యూలో సూర్య మాట్లాడుతూ.. విక్రమ్ 2 ఎప్పుడు మొదలవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తానని అన్నారు. ఇక కేవలం కమల్ హాసన్ కోసమే విక్రమ్ సినిమాలో నటించానని.. కానీ సెకండ్ పార్ట్ ఇప్పటిలో ఉండకపోవచ్చు అను అన్నారు సూర్య. ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్ తో ఓ సినిమా, కార్తీతో ఖైదీ 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత విక్రమ్ 2 ఉండే అవకాశం ఉంది. అప్పటికి సూర్య డేట్స్ ఖాళీ ఉంటే ఈ కాంబో సెట్ అవుతుంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా