Srikanth: సంక్రాంతికి పండగ లాంటి సినిమాతో వస్తున్నాం.. హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srikanth: సంక్రాంతికి పండగ లాంటి సినిమాతో వస్తున్నాం.. హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Srikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2023 | 9:10 PM

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా వారసుడు. ఇదే సినిమా తమిళ్‌లో వారిసు అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. తాజాగా శ్రీకాంత్ మీడియా తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్ గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది అని అన్నారు. ‘వారసుడు’ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు, నేను, కిక్ శ్యామ్, శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది.

వారసుడు సినిమాలో బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి. బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. అన్నీ చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌‌లా వుంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్‌కి అద్భుతమైన క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వారసుడిని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరో తో ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది.

ఇవి కూడా చదవండి

విజయ్ చాలా సైలెంట్ గా వుంటారు. ఎక్కువగా మాట్లాడరు. క్యారీవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు. ఒకసారి సెట్ లో అడు గు పెడితే ప్యాకప్ చెప్పినంత వరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు. ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పండగకి పండగ లాంటి సినిమా అని అన్నారు శ్రీకాంత్.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..