Siddharth: మీ లగ్జరీలు మీకు.. టాక్స్‌లు మాకు.. ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..

హీరో సిద్దార్థ్ మరో సారి సంచలన కామెంట్లు చేశారు. మీ లగ్జరీల కోసం మేము ట్యాక్సులు కడుతున్నామని మంత్రులకు కౌంటర్ ఇచ్చాడు హీరో సిద్దార్థ్.

Siddharth: మీ లగ్జరీలు మీకు.. టాక్స్‌లు మాకు.. ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..
Siddharth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2021 | 3:22 PM

Siddharth: హీరో సిద్ధార్థ్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. మీ లగ్జరీల కోసం మేం ట్యాక్సులు కడుతున్నామని మంత్రులకు కౌంటర్ ఇచ్చాడు హీరో సిద్ధార్థ్. టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం పై సినిమా ఇండస్ట్రీ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. టికెట్ ధరలు తగ్గించడం కరెక్ట్ కాదు అని ఇప్పటికే కొందరు సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వారు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల హీరో నాని మాట్లాడుతూ.. కిరాణా కొట్టు కలెక్షన్స్ కంటే థియేటర్స్ కలెక్షన్స్ తక్కువ వస్తున్నాయ్ అని సంచలన కామెంట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వం తెలుగు ప్రేక్షకులను అవమాన పరిచేలా ప్రవర్తిస్తుందని నాని వ్యాఖ్యానించాడు. దాంతో ఏపీ మంత్రులు భగ్గుమన్నారు. నాని పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రంగంలోకి హీరో సిద్ధార్థ్ దిగాడు.

రెమ్యునరేషన్‌తో సహా సినిమా మేకింగ్‌కి అయ్యే ఖర్చు తగ్గించుకోండి. ఆ డిస్కౌంట్‌ అప్లై చేసి వీక్షకులకు తక్కువ రేట్‌లో సినిమా చూపించండి. ఇదీ ఏపీ మంత్రులు కొందరు హీరోలకు వేసిన చురక. కానీ ఇదే చురకకు కౌంటర్ ఇచ్చారు యాక్టర్ సిద్ధార్థ్. మంత్రులూ.. మేం ట్యాక్స్‌ పేయర్లం. మేం కడుతున్న ట్యాక్సులతో మీరు లగ్జరీలు అనుభవిస్తున్నారు. మీ విలాసాలు కాస్త తగ్గించుకుని.. ఆ డిస్కౌంట్‌ని మాకు అందించండీ అంటూ పోస్ట్ చేసి.. రగులుతున్న ఇష్యూకి ఇంకాస్త ఆజ్యం పోశారు సిద్దార్థ్‌.  ఏపీలో సినిమా టికెట్లు.. దాని కేంద్రంగా ఇండస్ట్రీ, ప్రభుత్వ పెద్దల మధ్య జరుగుతున్న వివాదంలో తరచూ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు యాక్టర్ సిద్ధార్థ్. ఇప్పుడు ఏపీ మంత్రులను ఉద్దేశించి ఆయన పోస్ట్ చేసి ఉండొచ్చుగానీ.. మొన్నీ మధ్యే సినీ ప్రొడ్యూసర్లనూ ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రొడ్యూసర్లు అబద్దాలు చెబుతున్నారన్నారు. ఇండియాలో అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఈ తరహా అబద్దాలు కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది.. పద్ధతి మారాలంటూ ట్వీట్ చేశారు.

తాజాగా ఆయన మంత్రులను చేసిన టార్గెట్‌కు రిప్లైలు, రీట్వీట్లు, లైకులు, షేర్లూ బాగానే పండుతున్నాయి. ఓవైపు సొంత సినీ పరిశ్రమకు చురకలు.. మరోవైపు సినీ ఇండస్ట్రీకి సూచనలిస్తున్న ఏపీ మంత్రులకు సూచనలు, వెరసి సిద్ధార్థ ట్విట్టర్ పోస్టింగ్ కాస్త వెరైటీగానే ఉంది.  మీ లగ్జరీల కోసం మేము టాక్స్ లు కడుతున్నాం అని అన్నాడు. మంత్రులు మీ లగ్జరీలు తగ్గించుకోండి.. మాకు డిస్కౌంట్ ఇవ్వకండి అని ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది.మరి దీని పై ఏపీ  మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్