Nani 30th: నేచురల్ స్టార్ నయా మూవీ అనౌన్స్ చేశేసాడోచ్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేసిన నాని

ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దసరా అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ కనిపించనున్నాడు.

Nani 30th: నేచురల్ స్టార్ నయా మూవీ అనౌన్స్ చేశేసాడోచ్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేసిన నాని
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2022 | 6:44 PM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఇటీవలే అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దసరా అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే నాని నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఆయన నిర్మించిన హిట్2 సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది. త్వరలో హిట్ 3లో నటించనున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని కనిపించనున్నాడని అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నాని మరో సినిమాను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు.

నాని తన కెరీర్ లో రాబోతున్న 30వ సినిమాను అనౌన్స్ చేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్ ఫై నిర్మిస్తున్నారు. జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాగురించిన మరిన్ని విషయాలు అనౌన్స్ చేయనున్నారు. బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లో నాని కుర్చీలో కూర్చుని ఫోన్లో బ్రౌజ్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ లో చూపించారు. ఇప్పుడు ఈ ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని 30 కి సంబంధించిన దర్శకుడు ఇతర ముఖ్యమైన వివరాలు న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇటీవలే సీతారామం సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ భామ.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?