Veera Simha Reddy: బాలయ్య గారిలో ఉన్న గొప్ప విషయం అదే.. ఆసక్తికర విషయం పంచుకున్న సాయి మాధవ్ బుర్రా

ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా 'వీరసింహారెడ్డి' చిత్ర విశేషాలని పంచుకున్నారు . 'వీరసింహారెడ్డి' లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

Veera Simha Reddy: బాలయ్య గారిలో ఉన్న గొప్ప విషయం అదే.. ఆసక్తికర విషయం పంచుకున్న సాయి మాధవ్ బుర్రా
Sai Madhav Burra
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2022 | 9:18 PM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ వీరసింహారెడ్డి.  బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలని పంచుకున్నారు .

‘వీరసింహారెడ్డి’ లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు. ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. కథని పాత్రని సన్నివేశాన్ని హీరో ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. ‘వీరసింహారెడ్డి’ కథ చర్చల ప్రారంభం నుండి ఈ ప్రాజెక్ట్ లో వున్నాను అన్నారు

ఇవి కూడా చదవండి

వీరసింహరెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ వుంది. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. వీరసింహరెడ్డి ఫుల్ ప్యాకేజ్. బాలకృష్ణ గారి సినిమాల నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా వీరసింహారెడ్డి కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ వుంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. కథ వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వీరసింహా రెడ్డి కథలో అద్భుతమైన ఎమోషన్ వుంది. వీరసింహా రెడ్డి డైలాగ్స్ రాయడానికి రెండు నెలలు పట్టింది అన్నారు. బాలయ్య గారిలో వున్న గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి కథ కి ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు అని చెప్పుకొచ్చారు.