Mahesh Babu: విక్రమ్ సినిమాపై మహేశ్‌ బాబు ప్రశంసలు.. కమల్‌ గురించి ఏం చెప్పారంటే..

Vikram Movie: లోకనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) హీరోగా నటించిన చిత్రం విక్రమ్‌(Vikram). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. మరో కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య రోలెక్స్‌ పాత్రలో..

Mahesh Babu: విక్రమ్ సినిమాపై మహేశ్‌ బాబు ప్రశంసలు.. కమల్‌ గురించి ఏం చెప్పారంటే..
Mahesh Babu
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2022 | 7:59 AM

Vikram Movie: లోకనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) హీరోగా నటించిన చిత్రం విక్రమ్‌(Vikram). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. మరో కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య రోలెక్స్‌ పాత్రలో చివర్లో మెరుపులు మెరిపించాడు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన ఈ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి లాంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించాడు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu) విక్రమ్‌ సినిమాపై స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా సినిమాను, అందులోని నటీనటులను ప్రశంసించారు.

‘విక్రమ్‌’ బ్లాక్‌బస్టర్‌ సినిమా. న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌. డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని తప్పకుండా కలిసి, విక్రమ్‌ మొదలైన దగ్గరి నుంచి పూర్తయ్యే వరూ ఎలా షూట్‌ జరిగిందో అడిగి తెలుసుకుంటా. సినిమా సూపర్‌గా ఉంది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ నటనలో ఇంతకన్నా గొప్ప మెరుపులు ఉండవు. అనిరుధ్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత విక్రమ్‌ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఇక చివరిగా లెజెండ్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకింకా రాలేదు.. సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని. నిజంగా చాలా గర్వంగా ఉంది. కమల్‌ సర్‌… మీకు, మీ విక్రమ్‌ టీమ్‌కు శుభాభినందనలు’ అని వరుస ట్వీట్లలో రాసుకొచ్చారు. కాగా థియేటర్లలో సందడి చేస్తున్న విక్రమ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జులై 8వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..