Yatra 2: జగన్ గారిలా చేయడం చాలా కష్టం.. మూడు నెలలు టైం పట్టింది.. జీవ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహి వీ రాఘవ్. మళయాళ స్టార్ నటుడు మమ్ముట్టి ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ్ హీరో జీవ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Yatra 2: జగన్ గారిలా చేయడం చాలా కష్టం.. మూడు నెలలు టైం పట్టింది.. జీవ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Yatra 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2024 | 5:53 PM

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహి వీ రాఘవ్. మళయాళ స్టార్ నటుడు మమ్ముట్టి ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ్ హీరో జీవ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పొలిటికల్ డ్రామానుంచి విడుదలైన ట్రైలర్ , గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

ఈ సినిమాలో జగన్ పాత్రలో అయితే జీవా నటించాడు. తాజాగా జగన్ పాత్రలో నటించడం పై జీవ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ పాత్రలో జీవ అద్భుతంగా నటించారు. ట్రైలర్‌లో చూస్తే అర్ధమవుతుంది. జగన్ గా జీవ చక్కగా సెట్ అయ్యారు. తాజాగా జగన్ పాత్ర గురించి జీవ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను జగన్ పాత్రలోకి వెళ్ళడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను అని తెలిపాడు జీవ. అది కూడా ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాక అంటూ నవ్వుతు చెప్పారు జీవ. దీనితో ఈ ఆన్సర్ మంచి ఫన్ గా మరి వైరల్ గా మారింది. జగన్ సిగ్నేచర్ మూమెంట్స్ ను దింపేశారు జీవ. అలాగే వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది అన్నారు జీవ. అలాగే సోషల్ మీడియాలో. మీడియా, వీడియోలు రెగ్యులర్‌గా చూశాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఎలా ఉంటారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను అన్నారు జీవ. యాత్ర 2 సినిమాను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జీవ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Jiiva (@actorjiiva)

జీవ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Jiiva (@actorjiiva)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.