కన్నడ నాట స్టార్ హీరోగా, ఛాలెంజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు దర్శన్ తూగుదీప్. తన నటనతో అశేష అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు ఒక హత్య కేసులో జైలు పాలయ్యాడు. అభిమానులకు ఆదర్శంగా, అండగా ఉండాల్సింది పోయి అభిమానినే హత్య చేసి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు దర్శన్. స్టార్ హీరోగా సకల సౌకర్యాలు అనుభవించిన అతను ఇప్పుడు జైలులో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. రేణుకా స్వామి హత్య కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మరోవైపు రేణుకా స్వామి హత్యపై కర్ణాటకలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దర్శన్‌తో సహా 13 మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కాగా ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో పదే పదే చెబుతున్నాడట దర్శన్. పోలీస్ స్టేషన్ లో అసలు నిద్రపోవడం లేదట. పవిత్రతో సహా తోటి నిందితులు బిర్యానీ తిన్నా దర్శన్ మాత్రం ఖాళీ కడుపుతోనే ఉండిపోయాడట.
పోలీస్ స్టేషన్‌లో దిగాలుగా ఉంటోన్న దర్శన్ కు పండ్ల జ్యూస్, ఇడ్లీలు ఇచ్చిన తినలేదట. అయితే తాగడానికి ఒక్క సిగరెట్ ఇవ్వాలని మాత్రం పోలీసులను వేడుకున్నడట ఈ స్టార్ హీరో. ‘ చేతులు వణుకుతున్నాయి.. ఒక్క సిగరెట్ ఇప్పించండి ప్లీజ్’ అని దర్శన్ పోలీసులను అభ్యర్థించాడట. అయతే పోలీసులు మాత్ర దర్శన్ కు సిగరెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా విచారణలో భాగంగా ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉండనున్నాడీ హీరో. మరోవైపు దర్శన్ కు వ్యతిరేకంగా కన్నడ నాట ఆందోళనలు, ధర్నాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అభిమానిని హత్య చేయించిన ఈ స్టార్ హీరోకు కఠిన శిక్ష పడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కాగా రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా ఉన్నారు. దర్శన్ ఏ2గా, కె.పవన్ ఏ3గా ఉన్నారు. రాఘవేంద్ర ఏ4, నందీష్ ఏ5, జగదీష్ అలియాస్ జగ్గా ఏ6, అను ఏ7, రవి ఏ8, రాజు ఏ9, వినయ్ ఏ10, నాగరాజ్ ఏ11, లక్ష్మణ్ ఏ12, దీపక్ ఏ13, ప్రదోష్ ఏ14, కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా నమోదయ్యారు. ప్రస్తుతం మొత్తం 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.