‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదే..హీరో ఆకాశ్ సంచలన ఆరోపణ
ఈ మధ్య కాపీ ఆరోపణలు చాలా సహజం అయిపోయాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు..తమ కథ కాపీ కొట్టారు, మా కాన్సెప్ట్‌ను యూజ్ చేసుకున్నారు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. తాజాగా ఈ కాపీ మరక పూరి జగన్నాథ్‌కు కూడా తప్పలేదు. తన కథను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తీశారని ‘ఆనందం’ సినిమా హీరో ఆకాశ్ ఆరోపించాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇతివృత్తంతో రాధ అనే లేడి డైరక్టర్ ‘నాన్ యార్’ అనే […]
ఈ మధ్య కాపీ ఆరోపణలు చాలా సహజం అయిపోయాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు..తమ కథ కాపీ కొట్టారు, మా కాన్సెప్ట్‌ను యూజ్ చేసుకున్నారు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. తాజాగా ఈ కాపీ మరక పూరి జగన్నాథ్‌కు కూడా తప్పలేదు. తన కథను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తీశారని ‘ఆనందం’ సినిమా హీరో ఆకాశ్ ఆరోపించాడు.
‘ఇస్మార్ట్ శంకర్’ ఇతివృత్తంతో రాధ అనే లేడి డైరక్టర్ ‘నాన్ యార్’ అనే చిత్రాన్ని తీసి తమిళ్లో విడుదల చేశారని.. అందులో తనే హీరోగా నటించా అంటున్నారు ఆకాశ్. అక్కడ ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ అనే పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. రీసెంట్గా విడుదలైన పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తమకు పెద్ద షాక్ ఇచ్చిందంటున్నారు ఆకాష్. ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసి.. న్యాయం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. తనకు న్యాయం జరగని పక్షంలో న్యాయపోరాటానికి సిద్దమంటున్నాడు ఈ హీరో. మరి హిట్ జోష్‌లో ఉన్న పూరి అండ్ టీం ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.