Ajith Kumar: హీరో అజిత్‌ గొప్ప మనసు.. లేడీ ఫ్యాన్ సెల్ఫీ అడిగితే ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవుతారంతే

సాధారణంగా స్టార్‌ హీరోలు ఎంతో బిజీగా ఉంటారు. అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు అడిగితే కొందరు సింపుల్‌గా సారీ చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఇంకొందరు అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకుని వారితో ఫొటోలు దిగుతుంటారు. తాజాగా 'సార్.. సెల్ఫీ ప్లీజ్‌' అని ఓ లేడీ ఫ్యాన్‌ హీరో అజిత్‌ను అడిగింది.

Ajith Kumar: హీరో అజిత్‌ గొప్ప మనసు.. లేడీ ఫ్యాన్ సెల్ఫీ అడిగితే ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవుతారంతే
Hero Ajith Kumar
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2023 | 6:54 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. తన పేరిట ఉన్న అభిమాన సంఘాలను రద్దు చేసినా వారికి ఎంతో గౌరవం, మర్యాద ఇస్తుంటారు అజిత్‌. ఫ్యాన్స్‌ ఎలాంటి కష్టాలున్నాఆదుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి అజిత్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సాధారణంగా స్టార్‌ హీరోలు ఎంతో బిజీగా ఉంటారు. అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు అడిగితే కొందరు సింపుల్‌గా సారీ చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఇంకొందరు అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకుని వారితో ఫొటోలు దిగుతుంటారు. తాజాగా ‘సార్.. సెల్ఫీ ప్లీజ్‌’ అని ఓ లేడీ ఫ్యాన్‌ హీరో అజిత్‌ను అడిగింది. అయితే ఆ స్టార్‌ హీరో ఫొటో దిగడమే కాకుండా ..నెలల బిడ్డ, బ్యాగు మోయలేక ఇ‍బ్బందిపడుతున్న ఆమెకు సహాయం అందించారు. సదరు లేడీ ఫ్యాన్‌ బ్యాగును స్వయంగా మోశారు. లండన్‌ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మహిళా అభిమాని భర్త కార్తిక్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘అజిత్‌ సార్‌ గ్రేట్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వద్దంటున్నా.. సార్‌ బ్యాగు మోశారు..

‘ నా భార్య గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణిస్తోంది. ఆమె వెంట 10 నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో లండన్‌ విమానాశ్రయంలో ఆమె హీరో అజిత్‌ను కలిసే ఛాన్స్‌ వచ్చింది. ఆమె కడుపు మీద బిడ్డతో పాటు రెండు చేతుల్లో ట్రావెల్‌ సూట్‌ కేస్‌, బేబి బ్యాగ్‌తో జర్నీ చేస్తూ ఉంది. నా భార్య ఇబ్బందిని గమనించిన ఆయన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నా భార్య చేతిలోని బేబీ బ్యాగును అజిత్‌ తీసుకున్నారు. వద్దు అన్నా ఆయన వినలేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు. బేబి బ్యాగును విమానం వచ్చే వరకు మోశారు. ఆ సమయంలో ఆయన చేతుల్లో ఓ సూట్‌ కేసు కూడా ఉంది. విమానం వచ్చిన తర్వాత ఆ బ్యాగును నా భార్య సీటు దగ్గర పెట్టాలని క్యాబిన్‌ సిబ్బంది చెప్పారు. ఆయనతో పాటు వచ్చిన ఓ వ్యక్తి ‘ తలైవా మీరు ఎందుకు మోయడం.. నేను తీసుకు వస్తాను’ అని చెప్పాడు. అయినా అజిత్‌ వినలేదు. విమానాశ్రయంలోని బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూడా నా భార్య బ్యాగును తీసుకోవడానికి అడిగింది. కానీ ఆయన వినలేదు. అంత పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా ఆయన ఎంతో సింప్లిసిటీగా వ్యవహరించారు. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన ఎంతో గొప్ప మనిషి’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అజిత్‌ గొప్ప మనసు, అలాగే ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటూ ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..